HairFall : ఈరోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే జట్టు రాలుతోందని గగ్గోలు పెడుతున్నారు. అసలు జుట్టు ఎందుకు రాలుతోంది అన్న విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. జుట్టు రాలడానికి చాలా కారణాలే ఉంటాయి. అందులో శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం కూడా జుట్లురాలేందుకు ఓ కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎలుకలమీద పరిశోధన చేసి నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు. కొలెస్ట్రాల్ అనేది శరీరంలోని ప్రతి కణంలో ఉంటుంది. ప్రతి ఒక్కరి శరీరంలో కొవ్వు ఉంటుంది. కానీ… అది ఆరోగ్యకరమైన కొవ్వు అయ్యి ఉండాలి. మీకు విపరీతంగా జుట్టురాలుతుంటే.. దానికి కారణం శరీరంలోని అధిక కొలిస్ట్రాలే కావచ్చు.
Read Also: Heart Health Study: తేలికపాటి కోవిడ్ ఇన్ఫెక్షన్.. గుండెకు హాని కలిగిస్తుందా?
కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు రాలుతోందంట. అంతేకాదు..జుట్టు తొందరగా తెల్లగా మారుతుందట. తాజాగా జరిపిన పరిశోధనలో ఈ విషయం తేలడం గమనార్హం. ఈ పరిశోధన కోసం…ఎలుకలను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు ఎలుకలకు సాధారణ ఆహారం ఇవ్వగా.. మరో గ్రూపు ఎలుకలకు అధిక కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాన్ని ఇచ్చారు. అధిక కొలెస్ట్రాల్ ఉన్న ఆహారం తీసుకున్న ఎలుకలు తమ జుట్టును త్వరగా కోల్పోవడం ప్రారంభించాయి. జుట్టు తెల్లబడటం కూడా కనిపించినట్లు పరిశోధకులు కనుగొన్నారు. మొదటి 12 వారాలు వాటిలో ఎలాంటి మార్పు కనిపించలేదట. 36వారాల తర్వాత తేడా కనపడటం ప్రారంభమైంది. అధిక కొలిస్ట్రాల్ ఉన్న ఆహారం తీసుకున్న ఎలుకల్లో దాదాపు 75శాతం ఎలుకలు జుట్టు కోల్పోయాయట. మనుషుల్లోనూ ఇదే జరుగుతుందని వారు చెబుతున్నారు.
Read Also: AP CM Jagan: మే 9న ‘జగనన్నకు చెబుదాం’ ప్రారంభం.. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమీక్ష
కొలెస్ట్రాల్ బయోసింథసిస్ నిరోధం ఫైబ్రోసిస్‌ను ప్రోత్సహించడం ద్వారా జుట్టు కుదుళ్లకు శాశ్వత నష్టం కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్లే జట్టు విపరీతంగా ఊడిపోవడం, తొందరగా తెల్లవెంట్రుకలు రావడం లాంటివి జరుగుతున్నాయని వారు చెప్పారు. ధమనులలో అధిక కొలెస్ట్రాల్ చేరడం రక్త ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది. అంత్య భాగాలకు తగినంత రక్తం, ఆక్సిజన్ సరఫరాను పోషణ కోసం అందుకోలేకపోతుంది. దీని వల్ల కూడా జట్టురాలుతుందని వారు చెబుతున్నారు.