S.V.Madhav Reddy SP: అల్లర్లు సృష్టిస్తే జిల్లా బహిష్కరణ, కఠిన చర్యలు తప్పవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల పోలింగ్ అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్షన్ రోజు జరిగిన గొడవల్లో ఇప్పటికే 10 మందిని జైలుకు పంపడం జరిగిందని స్పష్టం చేశారు. జిల్లాలో అల్లర్లు సృష్టిస్తే జిల్లా బహిష్కరణతో పాటు కఠిన చర్యలు తప్పవుని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పెట్రోల్ బంకులు, కిరాణా షాపుల్లో లూజ్ పెట్రోల్ విక్రయాలు చేపట్టకూడదని ఆదేశించినట్లు చెప్పారు.
READ MORE: MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట.. మరోసారి రిమాండ్ పొడిగింపు
Also Read
- RCB Fans: కప్ గెలిచిన ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకపాయే.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..
- Virat Kohli: ట్రోఫీ గెలిచిన ఆనందంలో అనుష్క, దినేశ్ కార్తిక్ ఎమోషనల్ హగ్.. విరాట్ రియాక్షన్ మాములుగా లేదుగా.!
- Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
- CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మాధవరెడ్డి పునరుద్ఘాటించారు. ఫైర్ క్రాకర్స్ అక్రమ నిలువలపై దృష్టి సారించామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో గొడవలు సృష్టించిన వారిని ఇప్పటికే గుర్తించి బైండోవర్ చేస్తున్నామని తెలిపారు. కౌంటింగ్ రోజున రాజకీయ పార్టీ నాయకులు ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. కాగా ఈసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని పలు చోట్ల అల్లర్లు చెలరేగాయి. ఈ హింసాత్మక ఘటనలను ఈసీ సీరియస్ గా తీసుకుంది. కొంత మంది పోలీసు అధికారులను ఇప్పటికే బదిలీ చేసింది. అంతే కాకుండా ఈ ఘటనలకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పటు చేయగా.. ఆ బృందం ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది. ఈ నివేదికను ఎన్నికల సంఘానికి అందించనుంది. అయితే నివేదిక పరిశీలన అనంతరం చర్యలు తీసుకోనున్నారు ఉన్నతాధికారులు.
తాజావార్తలు
-
RCB Fans: కప్ గెలిచిన ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకపాయే.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..
-
Virat Kohli: నన్ను త్వరగా అవుట్ చేయాలని అందరూ చూస్తారు.. ఏం పర్లేదు, నా ప్లాన్స్ నాకుంటాయి!
-
Romantic Drama : తాగుబోతు ప్రేమకు ఇంత డిమాండా? ఐయండిబిలో 8.7 రేటింగ్
-
America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
-
Dell XPS 13 (2026): డెల్ XPS 13 ల్యాప్‌టాప్ విడుదల.. 32GB RAM, 2.5K టచ్‌స్క్రీన్‌తో ఆకట్టుకుంటున్న కొత్త మోడల్
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!