ఎన్నికల పోలింగ్ అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్షన్ రోజు జరిగిన గొడవల్లో ఇప్పటికే 10 మందిని జైలుకు పంపడం జరిగిందని స్పష్టం చేశారు.