స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరో గా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ”ఖుషి”.. ఈ సినిమా లో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయి లో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1 వ తేదీన ప్రపంచవ్యాప్తం గా ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల కు మరి కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉండటంతో మేకర్స్ సినిమా ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచారు..ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. లైగర్ వంటి ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా కావడం తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ అవ్వాలని విజయ్ దేవరకొండ ఫాన్స్ కోరుకుంటున్నారు..
ఈ సినిమా లో విజయ్ దేవరకొండ, సమంత ల కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రతి పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది.అలాగే తాజాగా విడుదల అయిన ట్రైలర్ కూడా సినిమా పై అంచనాలు పెంచేసింది.మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ తో సినిమా పై అంచనాలు మరింత గా పెంచేస్తున్నారు… ఇదిలా ఉండగా ఖుషి సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.ఈ సినిమా U/A సర్టిఫికెట్ ను అందుకుంది.సెన్సార్ సభ్యులు ఈ సినిమా స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యారని సమాచారం.అంతేకాదు ఈ సినిమా లో ఫ్యామిలి ఆడియన్స్ తో పాటు యూత్ ను ఆకట్టుకునే ఎన్నో అంశాలు ఉన్నాయని సమాచారం… అలాగే ఈ సినిమా నిడివి దాదాపు 2 గంటల 45 నిముషాలు ఉన్నట్లు తెలుస్తుంది.. మరి ఈ సినిమా తో విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటాడో లేదో చూడాలి.