Justin Trudeau: “పెద్ద దేశాలు, అంతర్జాతీయ చట్టాలు” అంటూ.. మరోసారి భారత్‌పై కెనడా ప్రధాని వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justin Trudeau: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీస్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా దేశాల మధ్య తీవ్ర దౌత్య వివాదానికి కారణమైంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాయి. తమ పౌరుడైన నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడ ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పడం వివాదాస్పదం అయింది. అంతే కాకుండా కెనడాలోని భారత సీనియర్ దౌత్యవేత్తను ఆ దేశం బహిష్కరించింది. దీనికి తీవ్రంగా స్పందించిన భారత్, కెనడియన్ దౌత్యవేత్తను దేశం వదిలి వెళ్లాల్సిందిగా హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో మరోసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇండియాను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘‘పెద్ద దేశాలు అంతర్జాతీయ చట్టాలను ఎటువంటి పరిణామాలు లేకుండా ఉల్లంఘించగలిగితే, ప్రపంచంలోని ప్రతీ ఒక్కరికీ మరింత ప్రమాదకరం’’ అని అన్నారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ ఎనర్జీ గ్రిడ్ ప్రారంభించిన సందర్భంగా కెనడా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడా తరుపున అమెరికా ఈ విషయాన్ని భారత్‌తో చర్చించాలా..? వద్దా.? అనే ప్రశ్నకు స్పందించిన ట్రూడో.. కెనడా పౌరుడి హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందనే విశ్వసనీయ ఆరోపణల గురించి మాకు మొదటి నుంచి తెలుసు, ఈ విషయం గురించి తమతో కలిసి పనిచేయాల్సిందిగా భారత్‌ని కోరామని, అమెరికా వంటి మా మిత్ర దేశాలతో ఈ విషయంపై సంప్రదించామని ఆయన అన్నారు.
Also Read
- Netanyahu: యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగిస్తుండగా షాకింగ్ సీన్.. ఇరాన్ ఏం చేసిందంటే..!
- Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
- POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
Read Also: Israel-Hamas War: గాజా ఆస్పత్రులను చుట్టుముట్టిన ఇజ్రాయిల్ సైన్యం..
ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని చట్టబద్ధమైన సంస్థలు, దర్యాప్తు సంస్థలతో పనిచేస్తున్నామని ట్రూడో వెల్లడించారు. కెనడా ఎల్లప్పుడు చట్టబద్ధమైన పాలన కోసం నిలబడే దేశమని, పెద్ద దేశాలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తే ప్రతి ఒక్కరికి ప్రమాదకరమని ఆయన అన్నారు. భారత్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించి 40 మంది కెనడా దౌత్యవేత్తల ప్రత్యేక రక్షణల్ని రద్దు చేయడంపై నిరాశ చెందినట్లు ట్రూడో అన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ప్రస్తుతం ఏం స్పందించలేదు. గతంలో ఈ వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. కెనడా తమకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని, ఒకవేళ ఇస్తే పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. నిజ్జర్ హత్యపై కెనడా చేసిన ఆరోపణల్ని భారత్ గతంతో తప్పుపట్టింది. కెనడా అసంబద్ధ రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించింది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!
-
Netanyahu: యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగిస్తుండగా షాకింగ్ సీన్.. ఇరాన్ ఏం చేసిందంటే..!
-
Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
-
POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
-
IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!