Allu Arjun : తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మలయాళ హీరోలలో ఉన్ని ముకుందన్ ఒకరు. ‘జనతా గ్యారేజ్’ సినిమాలో మోహన్ లాల్ కొడుకు పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ‘భాగమతి’ సినిమాలో అనుష్క ప్రేమికుడిగా కనిపించారు. ఆయన హీరోగా నటించిన తాజా మలయాళ చిత్రం ‘మార్కో’. డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లోను అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఓవర్ వయలెన్స్, తీవ్రమైన రక్తపాతం ఉందని విమర్శలు వచ్చినప్పటికీ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను ఎగబడి మరి చూస్తున్నారు. సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా అవతరించాడు ఉన్ని ముకుందన్.
Read Also:Pune: నాన్నకు అనారోగ్యమని అబద్ధం.. మహిళ సహోద్యోగిని చంపిన వ్యక్తి..
కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొని విమర్శల పాలయ్యాడు. కానీ ఇది తన కెరీర్ ను ఆపలేకపోయింది. ఆ తర్వాత బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నాడు. మెప్పాడియన్, మాలికాపురంతో ఉన్నిముకుందన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఇప్పుడు మార్కోతో స్టార్ హీరోగా మారాడు ఉన్ని. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ రూ. 100 కోట్ల మార్క్ ను దాటిసింది. సౌత్ నుండి ఒక్కొక్కరుగా పాన్ ఇండియన్ హీరోలుగా మారుతున్న టైంలో ఈ జాబితాలోకి రీసెంట్లీ ఎంటరయ్యాడు ఉన్ని ముకుందన్.
Read Also:ZEE Telugu: సంక్రాంతికి ప్రేక్షకుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపేందుకు వచ్చేస్తున్న జీ తెలుగు..
తాజాగా సినిమా చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మార్కో టీంను అభినందించారు. ఈ మేరకు యూనిట్ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఐకాన్ స్టార్ అలియాస్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అల్లు అర్జున్ గారు దర్శకుడిని పిలిచి మొత్తం బృందాన్ని అభినందించారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్, ప్రొడక్షన్ వాల్యూస్, ఉన్ని ముకుందన్ పవర్ ఫుల్ యాక్టింగ్ ను మెచ్చుకున్నారు. ఆయన సినిమాను ఇష్టపడ్డారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందించారంటూ రాసుకొచ్చారు.