పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత మహిళల ఆర్చరీ జట్టు శుభారంభాన్ని అందించింది. దీంతో.. క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. భజన కౌర్, దీపిక కుమారిలతో పాటు అంకిత భకత్ అద్భుత ప్రదర్శన చేయడంతో భారత్ టాప్-4లో నిలిచింది. ఈ ముగ్గురు ఆర్చర్లు కలిసి 1983 పాయింట్లు సాధించారు. అంకిత భకత్ (666) పాయింట్లు చేసింది. భజన్ కౌర్ (659), దీపికా కుమారి (658) పాయింట్లు సాధించింది. వ్యక్తిగత విభాగంలో అంకిత తృటిలో టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయింది.
ఫైనల్స్లో భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు అడుగుపెట్టింది. దీంతో ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. IBSA వరల్డ్ గేమ్స్‌లో అంధుల క్రికెట్ గత వారమే అరంగేట్రం చేయగా.. ఫైనల్స్ బెర్త్ ఖరారు చేసుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డు సాధించింది.