తొలి బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ గేమ్స్ ఫైనల్లో టీమిండియా పురుషుల అందుల క్రికెట్ జట్టుకు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా నిన్న (శనివారం) పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది.
ఫైనల్స్లో భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు అడుగుపెట్టింది. దీంతో ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. IBSA వరల్డ్ గేమ్స్‌లో అంధుల క్రికెట్ గత వారమే అరంగేట్రం చేయగా.. ఫైనల్స్ బెర్త్ ఖరారు చేసుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డు సాధించింది.