Site icon NTV Telugu

Kingdom: షాకింగ్: కింగ్డమ్ రిలీజ్ రోజే ఐబొమ్మ స్ట్రాంగ్ వార్నింగ్..

Kingdom

Kingdom

Piracy Twist on Release Day- Kingdom: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా రిలీజ్ రోజే పైరసీ సినిమాల వెబ్సైట్ ఐబొమ్మ స్ట్రాంగ్ ఇచ్చింది. వాస్తవానికి.. ఐబొమ్మ ఈ వెబ్‌సైట్‌లో పైరసీ చేసిన సినిమాను ఉంచుతారు. ఆ స్థానంలో ప్రస్తుతం కింగ్డమ్ సినిమాకు సంబంధించిన పోస్టర్ కనిపించింది. విడుదల రోజే సినిమాను పైరసీ చేశారా? అని క్లిక్ చేసి చూస్తే లోపల షాకింగ్ నోట్ ఉంచడం గమనించాం. “మా మీద ఫోకస్ చేస్తే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది.” అంటూ వార్నింగ్ నోట్ కనిపించింది.

READ MORE: Pawan Kalyan: కూటమి ప్రభుత్వానికి పవన్‌ ఝలక్‌లు ఇస్తున్నారా?.. డూడూ బసవన్నను కాదని చెప్పదల్చుకున్నారా?

NOTE: మా టీమ్ ముందే చెప్పింది, మా మీద ఫోకస్ చేస్తే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది అని కానీ మీరు మా మాట వినలేదు, మీరు ఏజెన్సీస్ కి డబ్బులు ఇస్తున్నారు కానీ వాళ్ళు మమ్మల్ని తొక్కి మా పేరుతో వల్లే వెబ్సైట్ రన్ చేస్తున్నారు, అన్ని వెబ్సైట్లు ఫోకస్ చేయకుండా సెలెక్టెడ్ వెబ్సైట్ ఎందుకు ఫోకస్ అవుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా ! మీకు బుర్రలేదా? కొంచెం వాడండి. ఈ సైట్ డబ్బులకోసం ప్రమాదకరమైన మాల్వేర్ యాడ్స్ పెట్టి వినియోగదారు డేటాను దొంగిలిస్తుంది దానిని మోసపూరిత పార్టీలకు విక్రయిస్తుంది. ఇదంతా మా బ్రాండ్ పేరును ఉపయోగించి జరుగుతోంది. లాస్ట్ టైం విజయ్ నలిగాడు (ఖుషి) మల్లా ఇదే సమయం లో నలగటం ఇష్టం లేదు అందుకే మీకు 24 గంటలు సమయం ఇస్తున్నాం మీరు ఈ కింద వెబ్సైట్ బ్లాక్ చేస్తే సరి లేదంటే మా పని మేము చేసుకుపోతాం, ఇంకోసారి ఈ నోట్ లు వుండవు, ఇండస్ట్రీ ని కాపాడండి ! ఇబొమ్మ టీం! ఇది ఎవడి వెబ్సైటు? నీ R M గాడి వెబ్సైటు ఆ – https://rta.ibomma.foo అంటూ ప్రశ్నించింది. అయితే ఈ వార్నింగ్ కింగ్డమ్ సినిమా టీం కి ఇచ్చినట్లు అర్థమవుతుంది కానీ నిర్మాతకు ఇచ్చిందా లేక ఈ సినిమా కోసం పని చేస్తున్న యాంటీ పైరసీ సెల్ టీంకి ఇచ్చిందా అనే విషయం మీద క్లారిటీ లేదు..

Exit mobile version