ఈ ఎన్నికల్లో 130 స్థానాలు కూటమికి వస్తాయని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. అమరావతిలోనే తెలుగు దేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం డేట్ భువనేశ్వరి డిసైడ్ చేస్తారు అని చెప్పుకొచ్చారు. ఇక, చంద్రబాబు ఆత్మ కథలో నాకో పేజీ ఉంటుంది.. టిక్కెట్ కోసం రక్తంతో చంద్రబాబు కాళ్లు కడగలేదు అని ఆయన పేర్కొన్నారు.
ఓడాక చాలా మంది పార్టీ వదిలి పారిపోయినా నేను నిలబడ్డాను.. పోరాటం చేయని వాళ్లు బ్లాక్ మెయిల్ చేసి టిక్కెట్లు తెచ్చుకున్నారు.. మాకు అన్ని అర్హతలున్నా టిక్కెట్లు రాలేదు.. కాగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాపై దాడులు చేయించారు అని బుద్దా వెంకన్న ఆరోపించారు.
Read Also: Ananya Nagalla : కర్ర సాముతో అదరగొడుతున్న అనన్య.. వీడియో వైరల్..
అయితే, మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ పదవికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేలం పాట పెట్టారు అని టీడీపీ నేత బుద్దా వెంకన్న పేర్కొన్నారు. పిన్నెల్లిని షూట్ చేసినా తప్పులేదు.. ఓటమి ఖాయమని డిసైడ్ అయిన కొందరు వైసీపీ నేతలు విదేశాలకు చెక్కేశారు.. వాళ్లు కౌంటింగ్ కి కూడా రారు.. రెడ్ బుక్ లో పిన్నెల్లి పేరుంది అని వార్నింగ్.. టీడీపీ నేతలపై దాడులకు పాల్పాడిన వారి పేర్లను రెడ్ బుక్ లో రాసుకొచ్చామని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారనేది స్పష్టంగా కనిపిస్తుందన్నారు. మాకు ఎలాంటి భయం లేదు.. అందుకే మేము రాష్ట్రంలో ఉన్నాం.. వైసీపీ నేతల వలే ఇతర రాష్ట్రాలకు వెళ్ల దాచుకోలేదని బుద్దా వెంకన్న అన్నారు.