2011 వన్డే ప్రపంచ కప్ టైంలోనే యువరాజ్ సింగ్ ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడుతున్నట్టు తెలిసింది. వెస్టిండీస్‌తో మ్యాచ్ సమయంలో గ్రౌండ్‌లోనే రక్తపు వాంతులు చేసుకున్న యువీ, మొండి పట్టుదలతో 36 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడు. 123 బంతుల్లో 113 పరుగులు చేసిన యువీ, 2 వికెట్లు కూడా తీసుకున్నాడు.
Read Also : Cement Rates: ఈ ఏడాది తగ్గనున్న సిమెంట్ ధరలు.. క్రిసిల్ అంచనా…
ప్రపంచ కప్ ముగిసిన తర్వాత అమెరికాలో క్యాన్సర్‌కి చికిత్స తీసుకున్న యువరాజ్ సింగ్, కీమో థెరపీ తర్వాత 2012 మార్చిలో ఆసుపత్రి నుంచి డిశార్జి అయ్యాడు. క్యాన్సర్ నుంచి కోలుకున్న యువరాజ్ కి 2012 టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. 2012 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 34 పరుగులు చేసిన యువీ.. టోర్నీలో 8 వికెట్లు తీసి టీమిండియా తరుపున టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. కానీ 2013 ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన జట్టులో యువరాజ్ సింగ్‌కి స్థానం లభించలేదు.
Read Also : Courier Scam: కొరియర్ పేరుతో సైబర్ నేరగాళ్ల సరికొత్త మోసాలు..
2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో 21 బంతుల్లో 11 పరుగులు చేసిన యువరాజ్ సింగ్, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై 32 బంతుల్లో 53 పరుగులు చేసిన యువీ, ఆ తర్వాత యోయో టెస్టులో ఫెయిల్ అవ్వడంతో టీమ్ లో చోటు కోల్పోయాడు. తిరిగి భారత జట్టులోకి కమ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు విరాట్ కోహ్లీ చాలా సపోర్ట్ చేశాడు.. అతని కెప్టెన్సీలో చాలా అవకాశాలు వచ్చాయి. కోహ్లీ సపోర్ట్ లేకపోతే నా కమ్‌బ్యాక్ జరిగేది కూడా కాదు అని యువరాజ్ సింగ్ తెలిపాడు.
Read Also : Dowry Harassment: పెళ్లైన ఏడాదికే వివాహిత ఆత్మహత్య.. ఆ వేధింపులు భరించలేకే..
అయితే, మహేంద్ర సింగ్ ధోనీ, నాకు మంచి స్నేహితుడు.. సెలక్టర్లు నన్ను, 2019 వన్డే వరల్డ్ కప్ ఆడించాలని అనుకోవడం లేదని చెప్పాడు. ఏం జరగబోతుందో మాహీ వల్లే నేను గ్రహించాను. ధోనీ ఇచ్చిన క్లారిటీతోనే రిటైర్మెంట్ తీసుకున్నాను అని యువీ తెలిపాడు. 2011 వన్డే వరల్డ్ కప్ వరకూ ధోనీతో ఆడడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. ధోనీ నువ్వే నా మెయిన్ ప్లేయర్‌వి అని చెప్పి నాలో ఉత్సాహాన్ని నింపేవాడు అని యువీ అన్నాడు.
Read Also : Naxals Audition for Movie: సినిమాల్లోని రియల్ నక్సలైట్లు.. గడ్చిరోలిలో మూవీ ఆడిషన్
క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ ఇద్దరూ ఫోన్లు చేసి నాలో ఆత్మవిశ్వాసం నింపారు అన్నాడు. క్యాన్సర్ నుంచి బయటికి వచ్చేసరికి టీమ్‌లో చాలా మార్పులు వచ్చాయి. ధోనీ టీమ్‌లో నా ప్రాధాన్యం తగ్గింది. అది వ్యక్తిగతం నన్ను చాలా బాధపెట్టింది.. అంటూ యువరాజ్ సింగ్ కామెంట్ చేశాడు.