Tomato Price: కిలో టమాటా 75 పైసలే.. లబోదిబోమంటున్న రైతులు
- కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో పతనమైన టమాటా ధరలు
- కిలో రూపాయి కూడా పలకకపోవడంతో ఆందోళనలో అన్నదాతలు
- జత బాక్సులు 40 రూపాయలకు కూడా కొనడం లేదని ఆవేదన
- ఆందోళన చేపట్టిన అన్నదాతలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato Price: ఆకాశాన్నంటిన టమాటా ధరలు.. ఇప్పుడు పాతాళానికి పడిపోయాయి. హైదరాబాద్‌లో దిగిరానంటున్న టమాటా రేటు.. కర్నూలులో మాత్రం రైతుల కంట కన్నీళ్లు తెప్పిస్తోంది. వందకు పైగా పలికిన టమాటా.. ఇప్పుడు రూపాయి కూడా పలకకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంటను పారబోసి ఆందోళన చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధర దారుణంగా పతనమైంది. కిలో రూపాయి కూడా పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జత బాక్సులు 40 రూపాయలకు కూడా కొనడం లేదని రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు ధర కాదు కదా.. కోత ధరలు కూడా రావడం లేదంటున్నారు రైతులు. మార్కెట్ బయటే పంటను పారబోశారు అన్నదాతలు. దీంతో, పెట్టుబడు, కిరాయిలు.. ఇలా ఏవీ దక్కకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో మార్కెట్ బయట రోడ్డుపై అరగంట పాటు వాహనాలు నిలిచిపోయాయి.
Read Also: CM Chandrababu: మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు తప్పనిసరి
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్‌పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
అయితే, హైదరాబాద్ మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడంతోనే టమోటా ధర తగ్గిందంటున్నారు వ్యాపారులు.. కానీ, మద్దతు ధర లేదని రైతుల ఆవేదన చెందున్నారు.. నిన్నటి దాకా బయటి మార్కెట్ లో కిలో టమోటా రూ.30 వరకు పలికింది.. కానీ, ఉన్నట్టుండి రూపాయికి పతనం కావడంతో.. ఎంతో కష్టపడి టమోటా పండించి.. మార్కెట్‌కి చేర్చితే.. కనీసం కూలీ డబ్బులు కూడా రావడం లేదు.. టమోటాను మార్కెట్‌కి తరలించే రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న మొన్నటిదాకా కిలో పది రూపాయలు నుండి 20 రూపాయలు పలికిన టమోటా ధర ఒక్కసారిగా కుప్పకూలడంతో టమోటా రైతులు లబోదిబోమంటున్నారు. గత కొద్ది రోజుల కిందట జత బాక్స్ 1500 నుండి 2000 పలికిన టమోటా ధర ప్రస్తుతం జత బాక్సు 40 కూడా ధర లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమోటా రైతుల దుస్థితి లాటరీ లాగా తయారయిందని కనీస రవాణా ఖర్చులు కూడా రావడంలేదని టమోటా తెంచిన కూలీలు కూడా రావడంలేదని రైతులు మండిపడుతున్నారు. హైదరాబాద్ టమోటా రావడంతో పత్తికొండ టమాటాకు ధర పలకడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరో వారం రోజుల్లో టమోటా ధర లేకపోతే మార్కెట్ బంద్ పరిస్థితి ఉందని మార్కెట్ వ్యాపారులు అంటున్నారు.
తాజావార్తలు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?