మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించారని.. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. చిత్తూరు పర్యటనలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. జగన్ వస్తున్నాడని తెలిసి, ఇక్కడ 2 వేల మంది పోలీసులను మొహరించి, రైతులను రానివ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారని.. చివరకు టూవీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారన్నారు. ఇక్కడికి కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎందుకు అన్నారు. ఎందుకీ…
ఆకాశాన్నంటిన టమాటా ధరలు.. ఇప్పుడు పాతాళానికి పడిపోయాయి. హైదరాబాద్‌లో దిగిరానంటున్న టమాటా రేటు.. కర్నూలులో మాత్రం రైతుల కంట కన్నీళ్లు తెప్పిస్తోంది. వందకు పైగా పలికిన టమాటా.. ఇప్పుడు రూపాయి కూడా పలకకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంటను పారబోసి ఆందోళన చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధర దారుణంగా పతనమైంది. కిలో రూపాయి కూడా పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.