Cyclone Effect: ఉమ్మడి విజయనగరం జిల్లాలో తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బొబ్బిలి, సాలూరు, భోగాపురం మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వందల ఎకరాల పొలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి తోటలు నేలమట్టమయ్యాయి. లక్షల రూపాయు పెట్టుబడి నేలపాలయ్యింది. ప్రతి ఏటా అరటి సాగుపై ఎకరాకి యాభై నుంచి లక్ష రూపాయలు లాభం వచ్చేది. కానీ, ఇప్పుడు పూర్తిగా పంట నేలపాలైంది. Abhishek Sharma: రాసి పెట్టుకో.. భారత జట్టుకు…
Tomato Farmers in Crisis: ఆరుగాలం కష్టపడి లక్షల రూపాయల ఖర్చు చేసి టమాటా సాగు చేస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు.. ప్రస్తుతం ఏపీలో టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు తగ్గడం, అదే టైంలో గిట్టుబాటు ధరలు లభించక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమోటా ధర దారుణంగా పడిపోయింది.
ఆకాశాన్నంటిన టమాటా ధరలు.. ఇప్పుడు పాతాళానికి పడిపోయాయి. హైదరాబాద్‌లో దిగిరానంటున్న టమాటా రేటు.. కర్నూలులో మాత్రం రైతుల కంట కన్నీళ్లు తెప్పిస్తోంది. వందకు పైగా పలికిన టమాటా.. ఇప్పుడు రూపాయి కూడా పలకకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంటను పారబోసి ఆందోళన చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధర దారుణంగా పతనమైంది. కిలో రూపాయి కూడా పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.