Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Software Engineer Suicide: హైదరాబాద్‌లో కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో పోలీసులు సీతారాం భార్య రేణుకతో పాటు ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రమణ రెడ్డి, శ్రవణ్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీతారాం హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన అనంతరం వెలుగులోకి వచ్చిన 19 పేజీల సూసైడ్ నోట్‌లో అతను తన భార్య రేణుక ప్రవర్తనను ప్రధాన కారణంగా పేర్కొన్నాడు. తన భార్యకు అనేక అక్రమ సంబంధాలు ఉన్నాయని, వాటిని తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో వివరించాడు.
సీతారాం తన సూసైడ్ నోట్‌లో రేణుకకు ముగ్గురు వ్యక్తులతో అక్రమ సంబంధం కొనసాగిందని, వారి వల్ల తన వ్యక్తిగత జీవితం తీవ్రంగా దెబ్బతిన్నదని రాశాడు. ముఖ్యంగా రమణ రెడ్డితో కలిసి ఉన్న ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం తనను మానసికంగా కుంగదీసిందని పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై ప్రశ్నించగా గతంలో రేణుక, రమణ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసినట్లు కూడా నోట్‌లో పేర్కొన్నాడు. తాను ఎంత నచ్చజెప్పినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదని, పరిస్థితులు మరింత దిగజారాయని తెలిపాడు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అంతేకాకుండా, తాను నెలకు రూ.2 లక్షల జీతం సంపాదిస్తూ కుటుంబాన్ని సుఖంగా చూసుకున్నానని, అయినప్పటికీ భార్య తనకు తెలియకుండా అనేక సంబంధాలు పెట్టుకోవడం తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక మధ్యతరగతి వ్యక్తిగా భార్యను గుడ్డిగా నమ్మడమే తన చేసిన పెద్ద తప్పు అని పేర్కొన్నాడు. ఇక సీతారాం తండ్రి కూడా కోడలిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. ఆమెకు ఆరుగురు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారని, ఆమె ప్రవర్తన వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇటీవల రేణుకతో పాటు ఆమె ఇద్దరు లవర్స్‌ను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు మరిన్ని వెలుగులోకి రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!