హైదరాబాద్‌లో భారీ మొత్తంలో నోట్లు పట్టుబడ్డాయి. నారాయణగూడ శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద మరో ఇద్దరిని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురి వద్ద ఉన్న 3 బ్యాగుల్లోని రూ.2 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ నోట్లు అన్ని రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు.
Also Read: Crime News: అంబర్ పేట్‌లో దారుణం.. భార్యపై కన్నేశాడని స్నేహితుడిని..!
మూడు బ్యాగులలో భారీ మొత్తంలో నోట్లు ఉన్నట్లు ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆటో డ్రైవర్ సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నారాయణగూడలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 3 బ్యాగుల్లో రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు నిందితులను తరలించారు. 2016లో పెద్ద నోట్లు రద్దు కాగా.. 9 ఏళ్ల తర్వాత పట్టుబడడం అందరిని షాక్‌కు గురిచేసింది. రద్దయిన నోట్లను ఏం చేయడానికి తీసుకెళ్తున్నారు అనే కోణంలో పోలీసులు విచారించనున్నారు.