Hyderabad Road Accident: ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు తరుచుగా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ నగర పరిసిరల్లో రెండు దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ బెంగళూరు జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. పెద్దషాపూర్ తాండాకు చెందిన దుర్గ అనే మహిళ రహదారి దాటుతుండగా, అటుగా వేగంగా వెళ్తున్న బుల్లెట్ బైక్ ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని, మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
CM Revanth Delhi Tour: సీఎం రేవంత్ ఢిల్లీ టూర్.. ప్రధాని మోదీ, రాహుల్, ఖర్గేలతో భేటీ..!
మరో ఘటనలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ స్విగ్గి డెలివరీ బాయ్ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా కొంపల్లి బ్రిడ్జి వద్ద సంఘటన స్థలానికి చేరుకున్న పెట్ బషీరాబాద్ పోలీసులు వివరాలు సేకరిస్తూ విచారణ సాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
5G సపోర్ట్, బెస్ట్ ఫీచర్స్.. 7040mAh బ్యాటరీతో Samsung Galaxy Tab A11+ భారత్‌లో లాంచ్!