Hayathnagar Crime: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్‌లో వ్యాపారి కాశీరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో హయత్‌నగర్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ముందుగా ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన వారు కాశీరావు దగ్గరి స్నేహితులేనని పోలీసులు నిర్ధారించారు. స్నేహితులకు ఇచ్చిన అప్పుకు కూడా 30 శాతం వడ్డీని కాశీరావు వసూల్ చేసినట్లు తెలిసింది. అధిక వడ్డీ కట్టలేక హత్య చేయాలని కాశీరావు స్నేహితులు డిసైడ్ అయ్యారని పోలీసులు వెల్లడించారు.
Read Also: CM Revanth Reddy: యాదాద్రి థర్మల్ స్టేషన్ రెండో యూనిట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
గత మూడు రోజుల క్రితం సర్జికల్ బ్లేడ్‌తో కాశీరావు గొంతు కోసి హత్య చేసిన అనంతరం శేఖర్ అనే నిందితుడు పీఎస్‌లో లొంగిపోయాడు. నలుగురు హత్య చేయగా.. పక్కా ప్రణాళిక ప్రకారం ఒక్కరు హత్య చేసినట్లు శేఖర్ లొంగిపోయాడు. హత్య చేసిన మరో ముగ్గురు బయట ఉండి బెయిల్ తెచ్చేందుకు ప్లాన్ చేశారు. పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటకు రావడంతో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఐతరాజు శంకర్, పెద్దగోని శేఖర్, పెద్దగోని సాయి, భవన సాయి ప్రసన్న కుమార్‌లు కలిసి హత్య చేసినట్లు గుర్తించి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.