NTV Telugu Site icon

Traffic Rules In Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. అతి చేసారో..?

Traffic

Traffic

Traffic Rules In Hyderabad: హైదరాబాద్ నగరంలో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ సమయంలో నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పునరుద్ధరణ చర్యలు అమలు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఆంక్షలలో, మూడు కమిషనరేట్ల పరిధిలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేయడం, బేగంపేట్ టోవ్లీచౌకి ఫ్లైఓవర్ సహా ఇతర ఫ్లైఓవర్లను కూడా మూసివేయడంచేయనున్నారు. అయితే, పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వబడుతుంది. అలాగే, ఔటర్ రింగ్ రోడ్డుపై హెవీ వెహికిల్స్ మాత్రమే రాగలిగే అవకాశం ఉంటుంది.

Also Read: Parliament scuffle: ఆ రోజు రాహుల్‌ గాంధీ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్‌లా ప్రవర్తించారు..

పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 280 కి పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు చెక్ పోస్టులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, 120 కి పైగా డ్రగ్ డిటెక్షన్ కిట్‌లను కూడా ఉపయోగించడానికి సిద్ధం చేశారు. తెలంగాణా నార్కోటిక్‌ బ్యూరో, తెలంగాణా పోలీసులు, ఇంకా ఎక్సైజ్ అధికారుల సంయుక్త దాడులు కూడా జరుగనున్నాయి. ఈ దాడుల కోసం 40 టీమ్‌లను సిద్ధం చేసినట్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఇక డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తులకు పదివేలు రూపాయల వరకు జరిమానా విధించనున్నారు.

Also Read: Harish Rao: పెండింగ్ వేతనాలు చెల్లించి.. ఆర్పీల జీవితాల్లో వెలుగులు నింపండి!

మరోవైపు రాత్రి ఒంటిగంట వరకు ఈవెంట్లకు అనుమతి ఇచ్చారు. అయితే ఎవరైనా ఒంటిగంట తర్వాత ఈవెంట్లను కొనసాగించినట్లయితే, నిర్వాహకులపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ చర్యలు నగరంలో పర్యాటకులు, ట్రాఫిక్ భద్రత కోసం తీసుకుంటున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Show comments