Kanaka Durga Temple: నేడు హైదరాబాద్ నుంచి కనకదుర్గమ్మకు బంగారు బోనం.. వీఐపీ దర్శనాలు నిలిపివేత!
- హైదరాబాద్ నుంచి కనకదుర్గమ్మకు బంగారు బోనం
- 16 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ
- భక్తుల రద్దీతో వీఐపీ దర్శనాలు నిలిపివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో నేడు ఆధ్యాత్మిక సందడి నెలకొంది. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి సంప్రదాయబద్ధంగా తీసుకొచ్చే బంగారు బోనాన్ని అమ్మవారికి సమర్పించనున్నారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గత 16 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీలో భాగంగా తెలంగాణ భక్తులు ప్రతి ఏడాది కనకదుర్గమ్మకు బోనాలు సమర్పిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు.
ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటల మధ్య విజయవాడ బ్రాహ్మణవీధి జమ్మిదొడ్డి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం బోనాల బృందం భారీ ఊరేగింపుగా ఇంద్రకీలాద్రి వైపు బయలుదేరనుంది. మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల మధ్య చిన రాజగోపురం వద్దకు చేరుకుని, అక్కడి నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఈ ఊరేగింపు రెండు గంటలకు పైగా కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. ఆషాఢ మాస ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో భక్తులు బోనాలు, సారె సమర్పించేందుకు వస్తుండటంతో ఆలయంలో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రోటోకాల్, వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ ప్రకటించారు.
Also Read
- ICC T20 Rankings: ఇంగ్లాండ్‌కు చెక్.. సిరీస్‌తో పాటు ఐసీసీ అగ్రపీఠం దక్కించుకున్న టీమిండియా..
- Prahlad Joshi: ప్రధాని నమ్మకానికి కృతజ్ఞతలు.. బాధ్యతాయుతంగా పనిచేస్తా..
- IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
గత ఆదివారం ఒక్కరోజే 85 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడంతో ఆలయంలో తీవ్ర రద్దీ నెలకొంది. అదే పరిస్థితి నేడు కూడా ఉండే అవకాశం ఉన్నందున భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఘాట్ రోడ్ వైపు ప్రైవేట్ వాహనాల రాకపోకలను నియంత్రించడంతో పాటు దేవస్థానం బస్సులను పూర్తిస్థాయిలో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లలతో వచ్చే తల్లులు రద్దీ తక్కువగా ఉండే సమయాల్లో దర్శనానికి రావాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా ఉదయం 8 గంటలలోపు లేదా మధ్యాహ్నం 3 గంటల తర్వాత సాయంత్రం 5 గంటల మధ్య ఆలయానికి వస్తే సులభంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని సూచించింది. భక్తులంతా దేవస్థానం అధికారులకు సహకరించి, క్రమశిక్షణతో దర్శనాలు నిర్వహించుకోవాలని ఆలయ ఈవో కోరారు.
తాజావార్తలు
-
Kanaka Durga Temple: నేడు హైదరాబాద్ నుంచి కనకదుర్గమ్మకు బంగారు బోనం.. వీఐపీ దర్శనాలు నిలిపివేత!
-
Namo Namo Ji Shankara: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న శివయ్య పాట.. 8 ఏళ్లైనా అదే జోష్.. 50 కోట్ల వ్యూస్‌తో రికార్డు!
-
Amit Shah: పదవి కంటే దేశం, విద్యార్థులే ముఖ్యమని మరోసారి నిరూపించాం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అమిత్ షా స్పందన
-
Rajinikanth: ఆత్మకథతో మరో సంచలనం.. రజనీకాంత్ బయోపిక్ ప్లాన్ నిజమేనా?
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!