నవంబర్‌లో రిలీజౌతున్న సినిమాలన్నీ ప్రమోషన్లను షురూ చేస్తుంటే.. మోహన్ లాల్ మాత్రం కూతుర్ని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేసే పనిలో బిజీగా మారాడు. తన సినిమా వృషభ రిలీజ్ అవుతున్న విషయాన్ని కూడా మర్చిపోయినట్లున్నాడు. ఎక్కడా ప్రమోషన్లు చేయడం లేదు. అలాగే సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ పంచుకోవడం లేదు. ఈ ఏడాది ఎంపురన్, తుడరుమ్, హృదయ పూర్వంతో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ కొల్లగొట్టిన మోహన్ లాల్ నుండి నెక్ట్స్ భారీ ప్రయోగం వృషభ రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Also Read : DivyaBharathi : వేడి వేడి అందాలతో సెగలు పుట్టిస్తున్న దివ్య భారతి
తెలుగు, మలయాళంలో తెరకెక్కించాడు కన్నడ దర్శకుడు నంద కిషోర్. తొలుత ఈ సినిమాను ఈ అక్టోబర్ 16న రిలీజ్ చేయాలని భావించారు. అఫీషియల్ గా ప్రకటించారు కూడా. కానీ వీఎఫ్ఎక్స్ డిలే వల్ల నవంబర్ 6న రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ గా ప్రకటన చేశారు . కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే రిలీజ్ మరోసారి పోస్ట్ పోన్ అయినట్టు కనిపిస్తోంది. రిలీజ్ డేట్ కు కేవలం రెండు రోజులే గడువున్నా నో హడావుడి, నో హంగామా. మాలీవుడ్ సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం వృషభ మరోసారి వాయిదా పడబోతోందట. నవంబర్ నుండి డిసెంబర్ లేదా నెక్ట్స్ ఇయర్ కు జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఏక్కువ భాగం వీఎఫ్ఎక్స్ వర్క్ ఉందని అవి డిలే కావడం వల్లే రిలీజ్ ముందుకు జరుగుతుందని డైరెక్టర్ నంద కిషోర్ చెబుతున్నట్లు టాక్. మరోవైపు మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ రీసెంట్ గా డైస్ యురే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అలాగే మోహన్ లాల్ కూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఆ పనుల్లో బిజిగా ఉన్నాడు లాలెట్ట.