సూపర్ స్టార్ మహేష్ బాబు – గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గురించి సినీప్రియులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇప్పటివరకు “SSMB29” అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్న ఈ సినిమా, భారత సినిమా చరిత్రలోనే ఒక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నవంబర్ 15న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించిన మొదటి భారీ రివీల్ ఈవెంట్ జరగబోతోందనే విషయం తెలిసినప్పటికి. తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ సాధారణంగా కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లైవ్‌గా ప్రసారం కానుంది.
Also Read : Akshay Kumar: 100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్..
మొదటిసారిగా ఒక భారతీయ సినిమా ఈవెంట్‌ను జియో హాట్‌స్టార్ అధికారికంగా లైవ్ స్ట్రీమ్ చేయబోతోందని, ఆ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో మహేష్ అభిమానుల్లో హై వోల్టేజ్ ఉత్సాహం నింపింది. ఇదే “గ్లోబల్ లెవెల్ రివీల్”గా చెప్పుకోవచ్చు. ఇక జియో హాట్‌స్టార్ టీమ్ ప్రతిరోజూ పోస్ట్ చేస్తున్న “గ్లోబ్ ట్రాటర్” టీజర్ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌లో ఎగ్జైట్‌మెంట్ మరింత పెరిగిపోయింది. ప్రతీ పోస్టర్, ప్రతీ ట్యాగ్ లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రోజు కూడా ఈ దీనికి సంబందించి హాట్ స్టార్ ఓ ఫన్ని మీమ్ పంచుకుంది. ఇక నవంబర్ 15 వరకు ఫ్యాన్స్ కౌంట్‌డౌన్ ప్రారంభమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. మహేష్ – రాజమౌళి కలయిక తెరపై చూపించబోయే మాంత్రికం కోసం మొత్తం ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.