Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fish Medicine: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం సోమవారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం, వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయగా.. వేలాది మంది ప్రజలు ప్రసాదం కోసం తరలివచ్చారు.
చేప ప్రసాదం పంపిణీ కోసం ఫిషరీస్ శాఖ మొత్తం 3 లక్షల చేప పిల్లలను సిద్ధం చేసింది. ఇందులో లక్షా 40 వేల కొరమీను చేప పిల్లలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి మరిన్ని చేప పిల్లలను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. రాత్రి నుంచి ఇప్పటి వరకు 50 వేల మందికి పైగా చేప ప్రసాదం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి రోగులు రెండు రోజుల ముందుగానే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈసారి సుమారు 3 లక్షల మందికి పైగా ప్రసాదం తీసుకునేందుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Also Read
ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో ప్రజలు ఈ చేప ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. చిన్న సజీవ చేప నోటిలో ప్రత్యేక ఆయుర్వేద మందును ఉంచి రోగులు మింగే విధంగా ప్రసాదాన్ని అందజేస్తారు. చేపలు తినలేని శాకాహారులకు అదే మందును బెల్లంతో కలిపి అందిస్తున్నారు. ప్రసాదం కోసం వచ్చిన ప్రజలకు ప్రభుత్వం విస్తృత సౌకర్యాలు కల్పించింది. వృద్ధులు, వికలాంగులు, వీఐపీల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. క్యూలైన్ల ద్వారా ప్రజలను క్రమబద్ధంగా పంపించి, వాలంటీర్ల సహాయంతో ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఈ చేప ప్రసాదం పంపిణీ ఈరోజు రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!