Deer Meat In HYD: అతను పేరుకు డాక్టర్ వృత్తి నిర్వహిస్తున్నాడు. కానీ ప్రవృత్తి మాత్రం హంటర్. అంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాల్లో నిత్యం వన్యప్రాణులను వేటాడుతున్నాడు. వాటి మాంసం, కొమ్ముల వంటి ఇతర శరీర భాగాలను అమ్ముకుంటూ అడ్డంగా సంపాదిస్తున్నాడు. ఇందుకోసం తుపాకులు సైతం వినియోగిస్తున్నాడు. పోలీసులకు ఈ సమాచారం అందడంతో అతన్ని పట్టుకున్నారు. ఇంతకీ ఆ కంత్రీ డాక్టర్ ఎవరు?
Waqf Amendment Act: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కీలక తీర్పు.. స్వాగతించిన మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
పోలీసులు అరెస్ట్ చేసిన ఇతని పేరు మహ్మద్ సలీం. వృత్తిరీత్యా హైదరాబాద్ టోలిచౌకీలో వైద్యునిగా పని చేస్తున్నాడు. కానీ.. నిజానికి ఇతడు ఓ హంటర్. హైదరాబాద్ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాల్లోకి స్నేహితులతో కలిసి వెళ్లి వన్యప్రాణులను వేటాడుతున్నాడు. వాటిని తీసుకు వచ్చి మాంసం విక్రయించడం లేదా..ఫ్రెండ్స్ అందరికీ వాటి మాంసంతో తయారు చేసిన వంటకాలతో పార్టీ ఇవ్వడం మహ్మద్ సలీం హాబీ. ఇందుకోసం వీకెండ్‌లో సలీం అండ్ గ్యాంగ్ ఫారెస్ట్‌లకు వెళ్తున్నారు. ఫ్రెండ్స్ అందరి దగ్గరా తుపాకులు ఉన్నాయి. వీటిని షూటింగ్ పేరుతో అనుమతులు తీసుకున్నారు. షూటర్స్ పేరుతో అనుమతులు తీసుకున్న ఈ తుపాకులను వీళ్లు అక్రమంగా వన్యప్రాణులను వేటాడేందుకు ఉపయోగిస్తున్నారు. అయితే విషయం తెలిసి పోలీసులు వీళ్లపై దృష్టి పెట్టారు.
టోలీచౌకీ ప్రాంతంలో ఒక బొలెరో వాహనంలో పెద్ద ఎత్తున జింక మాంసంతో పాటు కొమ్ములను తీసుకొచ్చి అమ్ముతున్న నేపథ్యంలో పోలీసులకి సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు దాడి చేశారు. పోలీసులను చూసి వారిపై దాడికి ప్రయత్నం చేశారు సలీం అండ్ గ్యాంగ్. అంతే కాదు తమ బొలెరో వాహనంలో పారిపోయేందుకు ప్రయత్నించారు. చివరికి పోలీసులు.. వారిని వెంటాడి మరీ పట్టుకున్నారు. ఇద్దరు నిందితులు మహమ్మద్ సలీం, మహమ్మద్ ఇక్బాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 10 కిలోల జింక మాంసంతో పాటు 3 కొమ్ములు 5 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.
Teja Sajja : తేజసజ్జా ఆ హీరోల లిస్టులో చేరిపోయాడోచ్..
జింక మాంసాన్ని, కొమ్ములను పోలీసులు అటవీశాఖ అధికారులకు అప్పగించారు. వాహనాన్ని సీజ్ చేసి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామన్నారు. వన్యప్రాణులను రక్షించేందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.