Teja Sajja : యంగ్ హీరో తేజసజ్జా ఫుల్ జోష్ లో ఉన్నాడు. మిరాయ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో తేజ ఎన్నో రికార్డులు సృష్టిస్తున్నాడు. హనుమాన్ సినిమాతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న తేజ.. ఇప్పుడు దాన్ని మిరాయ్ తో మరింత పెంచుకున్నాడు. దెబ్బకు టైర్-2 హీరోల లిస్టులో చేరిపోయాడు తేజ సజ్జా. కరెక్ట్ కంటెంట్ పడితే ఈజీగా వంద కోట్ల వసూళ్లు రాబట్టే ఇమేజ్ ఉన్న హీరోలు ఇండస్ట్రీలో కొందరు ఉన్నారు. వారిలో నాని, విజయ్ దేవరకొండ, నాగచైతన్య లాంటి వారు ఉన్నారు. ఇప్పుడు తేజ కూడా అలాంటి హీరోల లిస్టులో చేరిపోయాడు. ఈ హీరోల సినిమాలకు మినిమమ్ ఓపెనింగ్స్ గ్యారెంటీ. ఒకవేళ హిట్ పడితే ఈజీగా వంద కోట్లు కొల్లగొడుతారు. ఇప్పుడు తేజ అంతకు మించి మిరాయ్ తో దుమ్ములేపాడు.
Read Also : Ramu Rathod : రాము రాథోడ్ అలా ఉండటం నచ్చట్లేదు.. పేరెంట్స్ ఎమోషనల్
కేవలం టాలీవుడ్ లోనే కాదు.. నార్త్ లోనూ దుమ్ములేపాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ టైర్-2 హీరోలకు నార్త్ లో పెద్దగా మార్కెట్ లేదు. కానీ తేజ మాత్రం హనుమాన్, మిరాయ్ సినిమాలతో నార్త్ ఇండస్ట్రీలో బలమైన పునాది వేసుకున్నాడు. అక్కడి ప్రేక్షకులకు దగ్గరైపోయాడు. కాబట్టి ఏ మాత్రం హిట్ వచ్చినా ఇటు సౌత్, అటు నార్త్ లో కలెక్షన్ల పారించే హీరోగా మారిపోయాడు తేజ. మిగతా టైర్-2 హీరోలకు హిట్ పడితే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే వసూళ్ల వర్షం కురిపిస్తారు. తేజ మార్కెట్ నార్త్ లో కూడా పెరగడంతో.. ఓ మెట్టు ఎక్కువే ఉన్నాడు. కానీ దాన్ని కంటిన్యూ చేయగలగాలి. లేదంటే మాత్రం ఆయన ఇమేజ్ మీదకే డ్యామేజ్ జరుగుతుంది. ఇంకొక్క సినిమా ఇలాంటిది పడితే మాత్రం తేజ ఏకంగా స్టార్ హీరోల లిస్టులో చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Read Also : Maremma : రవితేజ ఇంటి నుంచి మరో హీరో.. గ్లింప్స్ చూశారా..