Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్‌లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Cyber Crime: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 చేపట్టారు. సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న ముఠాలను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ సహా మొత్తం 15 రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందజేస్తున్న ముఠాల గుట్టురట్టు చేసిన పోలీసులు, 10 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. అలాగే సైబర్ నేరాలకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న 30 మందికి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గతంలో కూడా రెండు విడతల్లో ఆపరేషన్ ఆక్టోపస్‌ను నిర్వహించారు. మొదటి విడతలో సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు అందిస్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకోగా, ఆపరేషన్ ఆక్టోపస్ 1.0 ద్వారా పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం ఆపరేషన్ ఆక్టోపస్ 2.0లో సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న బ్యాంక్ మేనేజర్లు, సిబ్బందిపై దృష్టి సారించారు. ఇప్పుడు తాజా ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందజేస్తున్న నెట్‌వర్క్‌లను పూర్తిగా బట్టబయలు చేయడంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ ఆపరేషన్ ఇంకా పలు రాష్ట్రాల్లో కొనసాగుతోంది.
Also Read
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!