వెస్టిండీస్ లో ఆగష్టు 22 నుంచి 30 వరకు జరగనున్న మహిళల కరీబియన్ ప్రీమిమర్ లీగ్ (సీపీఎల్) టోర్నమెంట్ లో హైదరాబాద్‌కు చెందిన మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర ఎంపికైంది. ప్రణవి చంద్ర ఆతిథ్య ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తరుఫున ఆడేందుకు ఎంపికైంది. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి సీపీఎల్ కు ఎంపికైన తొలి క్రికెటర్ గా ప్రణవి నిలవడం గర్వకారణమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు అన్నారు.
Read Also: Asaduddin Owaisi: ముస్లింలను అంతం చేయడమే వక్ఫ్ బిల్లు లక్ష్యం..
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌కు ఎంపికైన తొలి హైదరాబాదీ క్రికెటర్‌గా ప్రణవి రికార్డు నెలకొల్పింది. 22 ఏళ్ల ప్రణవి రైట్ హ్యాండ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ కమ్ మిడిలార్డర్ బ్యాటర్. ఆమె ఇప్పటివరకు భారత జాతీయ జట్టుకు ఆడలేదు. కాగా.. హైదరాబాద్ టీమ్‌తో పాటు ప్రణవి సౌత్ జోన్ టీమ్ కూడా ప్రాతినిథ్యం వహించింది. దూకుడుగా ఉండే టాప్ ఆర్డర్ బ్యాటర్, దేశవాళీ టీ20లతో పాటు వన్డేలలో ప్రణవి ఆకట్టుకునే స్ట్రైక్ రేట్లు.. ట్రినిడాడ్ లోని తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగే లీగ్ కు ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించింది. లీగ్ లో ట్రినిడాడ్@టొబొగో జట్టులో ముగ్గురు భారతీయులు ఉన్నారు. వారిలో జెమియా రోడ్రిగ్స్, శిఖా పాండే, ప్రణవి ఉన్నారు.
Read Also: Fishing Boat: విశాఖ తీరంలో తునాతునకలైన ఫిషింగ్ బోటు.. విషయం ఏంటంటే..?