S*xual Harassment: హైదరాబాద్ లోని సైదాబాద్ బాలసదన్‌లో జరిగిన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై బాలసదన్ సూపరింటెండెంట్ సయ్యద్ అఫ్జల్, దర్యాప్తు అధికారి మైథిలీ (మహిళా సూపరింటెండెంట్) స్పందించారు. ఇందులో భాగంగా వారు పలు వివరాలను వెల్లడించారు. బాల సదన్ సూపరింటెండెంట్ సయ్యద్ అఫ్జల్ అందించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 11న సైదాబాద్ పోలీసులు బాల సదన్‌కు వచ్చి బాధిత బాలుడి ఫోటో చూపించి వివరాలు అడిగారు. ఆ బాలుడు పండుగ చేసుకుంటానని అడగటంతో అతన్ని షార్ట్ లీవ్ మీద తల్లిదండ్రుల వద్దకు పంపామని సూపరింటెండెంట్ పోలీసులకు తెలిపారు. తల్లితో కలిసి వచ్చిన బాలుడు అక్టోబర్ 11వ తేదీన లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేసినట్లు పోలీసుల ద్వారా తమకు తెలిసిందని అఫ్జల్ పేర్కొన్నారు.
బాధిత బాలుడు స్టాఫ్ గార్డ్ రెహమాన్ తనపై లైంగిక దాడి చేశాడని ఫిర్యాదు చేశాడని, దీని ఆధారంగా పోలీసులు బాల సదన్‌లో విచారణ చేపట్టారని ఆయన వివరించారు. ఈ లైంగిక దాడి విషయాన్ని బాధిత బాలుడు మరో ముగ్గురు పిల్లలతో పంచుకున్నట్లు తెలిసిందని, ఆ ముగ్గురు పిల్లల నుండి కూడా పోలీసులు స్టేట్మెంట్లు తీసుకున్నారని తెలిపారు. పోలీసులు వెంటనే స్టాఫ్ గార్డ్ రెహమాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆపై అరెస్టు చేసినట్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని అఫ్జల్ తెలిపారు.
Jubilee Hills by-election: రేపటిలోపు అభ్యర్థిని ప్రకటిస్తాం.. గెలిపించాలని కోరుతున్న..!
ప్రస్తుతానికి ఒక బాబుపై మాత్రమే లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు చెబుతున్నారని, మిగతా వివరాలు పోలీసుల విచారణలో బయటపడతాయని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఈ సంఘటన మార్చిలో జరిగిందని పోలీసులు చెప్పినా.. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ విషయం బయటికి రాలేదన్నారు. బాల సదన్‌కు జ్యుడీషియల్ ఆఫీసర్లు, CWC అధికారులు, కౌన్సిలర్లు వచ్చి కౌన్సిలింగ్ చేస్తున్నప్పటికీ వారి ద్వారా కూడా విషయం వెల్లడి కాలేదన్నారు. బాధిత బాలుడు సెప్టెంబర్ 2024లో బాల సదన్‌లో చేరాడని.. కాగా, లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రెహమాన్ 2022 నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాడని తెలిపారు. పిల్లల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ బాక్స్‌ను ఏర్పాటు చేస్తామని.. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారని, ఇలాంటి పరిస్థితులను ఉపేక్షించేది లేదని సయ్యద్ అఫ్జల్ స్పష్టం చేశారు.
మరోవైపు మహిళా సూపరిండెంట్, దర్యాప్తు అధికారి మైథిలీ మాట్లాడుతూ.. లైంగిక దాడి ఘటనపై తనను దర్యాప్తు అధికారిగా నియమించారని తెలిపారు. బాల సదన్‌లో విచారణ చేపట్టి, పలువురు పిల్లలతో మాట్లాడామని, మైనర్ బాలుడిపై లైంగిక దాడి జరిగిన మాట వాస్తవమే అని నిర్ధారించామని ఆమె ప్రకటించారు. ఇదే విషయంపై తాము ఒక నివేదికను తయారు చేసి CWC అధికారులకు అందజేశామని, అనంతరం చట్టపరమైన చర్యలు ఉంటాయని మైథిలీ వెల్లడించారు. ఈ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ కామెంట్స్‌గా మారాయి.
Ajay Devgn : డబ్బు కోసం బాధ్యత మరిచిపోయారా? అజయ్ దేవగన్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం