Whats App Chat: వాట్సాప్ చాట్ ప్రాణాల మీదకు తెచ్చింది.. ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్య..
- చిలుకానగర్‌లో పట్టపగలే దారుణ హత్య..
- ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సుధీర్ కుమార్..
- సంతోష్ నాయక్ అనే వ్యక్తితో సుధీర్‌కు పాత పరిచయం..
- వాట్సాప్ చాట్ విషయమై చిన్న పాటి ఘర్షణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌లో చెలరేగిన వివాదం.. ఇద్దరు స్నేహితుల మధ్య చిలికి చిలికి గాలివానలా మారింది. హైదరాబాద్ చిలుక నగర్లో అత్యంత దారుణంగా స్నేహితున్ని మర్డర్ చేసే స్థాయికి వెళ్లింది. చనిపోయిన వ్యక్తి ఏఆర్ కానిస్టేబుల్ కావడంతో పోలీసులు ఈ కేసును కేవలం 8 గంటల్లోనే ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇంతకీ హంతకులు ఎవరు? వాట్సాప్ చాట్ వివాదానికి ఎందుకు దారి తీసింది?
చిలుకా నగర్ చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన సుధీర్ కుమార్ పోలీస్ శాఖలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి తండ్రి సుబ్బయ్య కూడా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు. ఆయన ఇప్పటికే రిటైర్ అయ్యారు. ఐతే తండ్రి అడుగుజాడల్లోనే పోలీసు శాఖలో చేరారు సుధీర్. ప్రస్తుతం సిటీ సెక్యూరిటీ వింగ్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా సేవలందిస్తున్నారు. చిలుకా నగర్‌కు చెందిన సంతోష్ నాయక్ అనే వ్యక్తితో సుధీర్‌కు పాత పరిచయం ఉంది. వీరిద్దరి మధ్య ఓ వాట్సాప్ చాట్ విషయమై చిన్న పాటి ఘర్షణ జరిగింది. కానీ ఆ చాటింగ్ కాస్తా తీవ్ర వివాదానికి దారితీసింది. ఇద్దరూ పరస్పరం దూషించుకున్నారు. ఫోన్లోనే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు సంతోష్ నాయక్. అంతే కాదు సుధీర్‌ను నేరుగా మాట్లాడుకుందామని చిలుకా నగర్‌కు పిలిచాడు. ఐతే స్నేహితుడే కదా అనే నమ్మకంతో సుధీర్ అక్కడికి వెళ్లడంతో ఘోరం జరిగిపోయింది.
Also Read
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
Also Read:Hyderabad: ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ల ఆశ చూపి అత్యాచారం.. ఆపై హత్య..
వాట్సాప్ చాట్ పంచాయితీ ముగుస్తుందనుకుంటే.. అందుకు భిన్నంగా జరిగింది. ఆదర్శ్ నగర్ కాలనీ సమీపంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. ఆ సమయంలో సంతోష్ నాయక్ తన వద్ద ఉన్న కత్తితో సుధీర్ కుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. సుధీర్ కడుపు, ఛాతీ, మెడ భాగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో సుధీర్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దాడి జరిగిన సమయంలో సంతోష్ నాయక్‌తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో ఇద్దరు నిందితులను కేవలం 8 గంటల్లోనే పట్టుకున్నారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితోపాటు రక్తంతో తడిసిన దుస్తులు, సెల్ ఫోన్లు, బైకు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!