Hyderabad: ముగ్గురూ.. స్నేహితులు ! పొట్టకూటి కోసం బీహార్ నుంచి హైదరాబాద్ వచ్చారు !! ముగ్గురూ ఒకేచోట పనిలో చేరారు. కలిసి పనిచేసుకుంటూ కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారు. అన్యోన్యంగా ఉన్న వారి మధ్య అనుమాన భూతం చిచ్చు పెట్టింది. తన భార్యపై కన్నేశాడని తెలుసుకుని స్నేహితుడిని మందలించాడు..!! పలుమార్లు హెచ్చరించాడు..!! ఐనా తీరు మార్చుకోకపోవడంతో కక్షగట్టి దారుణంగా హతమార్చాడు. మృతదేహాన్ని మూసీ కాలువలో పడేశాడు. అంబర్‌పేట్‌లో జరిగిన ఈ మర్డర్ మిస్టరీని తెలివిగా చేధించారు పోలీసులు.
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో మైనర్ బాలిక హత్య కేసు రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన కుటుంబానికి ఈ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై దుండగులు దాడి చేసి హత్య చేసిన ఘటనలో పోలీసులు తాజాగా కీలక పరిణామాలను వెలుగులోకి తెచ్చారు.
Murder : చెల్లెలి కాపురాన్ని సరిదిద్దాల్సిన అన్నలు.. ఏకంగా బావను హత్య చేశారు. కిడ్నాప్ చేసి మరీ చంపేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో సంచలనం సృష్టించింది. ఐదు రోజుల్లోనే బావను హత్య చేసిన ఇద్దరు బామ్మర్దులను పట్టుకున్నారు పోలీసులు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మహ్మద్ సిరాజ్. కొద్ది రోజుల క్రితమే పెళ్లి అయింది.. అంతా బాగుంది అనుకున్న టైమ్‌లో సిరాజ్ నిత్యం వేధిస్తున్నాడని అతని భార్య.. సోదరులకు సమాచారం ఇచ్చింది. బావతోపాటు అత్తమామలు…