Site icon NTV Telugu

Padi Kaushik Reddy: అక్రమ మైనింగ్‌లో ఆ మంత్రి, ఎమ్మెల్యే పాత్ర.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Padi Kaushik Reddy

Padi Kaushik Reddy

హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.. కోర్టులో హాజరుపరచే ముందు.. వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకు తరలించారు. ఆస్పత్రిలోకి వెళ్లే ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు.. ఈ కాంగ్రెస్ సర్కార్ 20% కమీషన్ సర్కార్.. పోలీస్ ఆఫీసర్ల దగ్గర కమీషన్స్ తీసుకుంటున్నారు ఎమ్మెల్యే నాగరాజు.. అక్రమ మైనింగ్ చేస్తున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోకపోవడం హాస్యస్పదం..” అని వ్యాఖ్యానించారు. అంతలోపే పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఆసుపత్రిలోనికి తీసుకెళ్లారు.

READ MORE: Tamil Audience : తెలుగు సినిమాలపై ఏడుపు.. తమిళ తంబీలు మారరా?

వైద్య పరీక్షల అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య కాజీపేట లోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. రైల్వే కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. పాడి కౌశిక్ రెడ్డి క్వారీ యజమానిని భయభ్రాంతులకు గురి చేశాడు.. కౌశిక్‌ను డిమాండ్ చేయాలంటూ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. పాడి కౌశిక్ రెడ్డి బెదిరింపులతో మనోజ్ రెడ్డి కుటుంబం భయంతో ఉందని తెలిపారు. ఇది కక్ష సాధింపు కేసు గానే పరిగణించాలంటూ బీఆర్‌ఎస్ లీగల్ టీం వాదించింది.

READ MORE: TG EdCET Results: టీజీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల.. అబ్బాయిలదే హవా..

Exit mobile version