Amberpet: ఆడపిల్ల పుట్టిందని ఏడేళ్లుగా ఇంటికి రానివ్వలేదు.. ఆమె చేసిన పాపమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amberpet: ప్రస్తుత సమాజంలో మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ప్రతి రంగంలోనూ పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. పురుషులను మించి కూడా ఉద్యోగాల్లో మహిళలు రాణిస్తున్నారు. మహిళలు సాధికారిత వైపు అడుగులు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కూడా ఆడపిల్ల పుట్టడాన్ని పాపంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులు. ఆడపిల్ల పుడితే బయట చెత్తలో పడేసి వెళ్లడం, ఆడపిల్ల పుట్టిందని భార్యను భర్త, అత్తమామలు ఇంటి నుంచి వెలేయడం లాంటివి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది.
Read Also: Abdullahpurmet Case: అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసు.. ఏడు రోజుల కస్టడీకి నిందితుడు
Also Read
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
- Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
- Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
- Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్‌కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
ఆడపిల్ల పుట్టిందని ఏడేళ్లుగా ఇంటికి రానివ్వలేదు ఆ ఇల్లాలి భర్త, అత్తమామలు. దీంతో భర్త ఇంటి ముందు బాధితురాలు ధర్నా చేపట్టింది. నేను చేసిన నేరం ఏమిటంటూ భర్త, అత్తమామలను నిలదీసింది. ఈ సంఘటన అంబర్‌పేట్‌లోని ఆర్‌కే నగర్‌లో జరిగింది. భర్త ఇంటి ముందు కూతురితో కలిసి బాధితురాలు మాధవి బైఠాయించింది. ఏడేళ్లుగా మాధవి న్యాయపోరాటం చేస్తోంది. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భర్త కిరణ్‌కుమార్, అత్తమామలు ఇంటి నుండి గెంటేసినట్లు వాపోతోంది. గత మూడు రోజులుగా భర్త ఇంటి ముందు నిరసన చేపట్టింది. కానీ భర్త, అత్తమామలు ఆమెను పట్టించుకోలేదు. తనను, కూతురిని ఇంట్లోకి అనుమతించే వరకు అక్కడే ఉంటానని కూతురితో కలిసి బైఠాయించింది. తనకు తన కూతురికి న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. మాధవికి పలు మహిళా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.
తాజావార్తలు
-
God Of War : త్రివిక్రమ్‌తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
-
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
-
New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
-
Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Ikka Trailer: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి.. సన్నీ, అక్షయ్ కోర్ట్‌రూమ్ వార్ అదిరింది
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్‌ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!