Andhrapradesh Crime: దెయ్యం పట్టిందనే నెపంతో భార్యను కొట్టి చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhrapradesh Crime: కట్టుకున్న ఇల్లాలిని కర్కశంగా హతమారుస్తున్న భర్తల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. దెయ్యం పట్టిందనే నెపంతో భార్యను భర్త కిరాతకంగా కొట్టి చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి గ్రామంలో బళ్ళవాణి మనీషా (25)ను తన భర్త విజయ్ కుమార్ దారుణంగా కొట్టి హత్య చేశాడు.
Also Read: Hundred Meter Race: పక్కెళ్లి ఆడుకోమ్మా.. ఏంటమ్మ ఆ పరుగు.. పరువు తీశావుగా..!
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
మనీషా, విజయ్‌కుమార్‌లకు చాలా కాలం క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్యకు విజయ్‌కుమార్ సరిగా తిండి కూడా పెట్టేవాడు కాదని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఫిట్స్ వచ్చాయని ఆయన చెప్పాడు.తన భార్యకు దెయ్యం పట్టిందని నెపంతో భర్త మెడపై గట్టిగా కొట్టడంతో కిందపడిపోయిందని.. చికిత్స నిమిత్తం అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ ఆమె ప్రాణాలు విడిచింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మనీషా మృతదేహం పక్కనే తమ తల్లి చనిపోయిందని కూడా తెలియని చిన్నారులు పడుకుని ఉండడం అక్కడివారిని కలచివేసింది. వారి పరిస్థితిని చూసి పలువురు కంటతడి పెట్టారు. తన కుమార్తెను అమానుషంగా కొట్టి చంపిన భర్త, అత్తలపై చర్య తీసుకోవాలని మృతురాలు తండ్రి డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!