Bangladesh MP Murder Case: బంగ్లా ఎంపీ హత్య కేసులో కీలక మలుపు.. మానవ ఎముకలు స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh MP Murder Case: గత నెలలో బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకు గురైన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైద్యం కోసం కోల్‌కతా వచ్చిన ఆయనను దారుణంగా హత్య చేశారు. ఇప్పటికే ఆయన బాడీని రికవరీ చేయడం దర్యాప్తు అధికారులకు కష్టంగా మారింది. అంత పకడ్బందీగా ఈ హత్యకు పాల్పడ్డారు. మే 12న కోల్‌కతాకు వచ్చిన అన్వరుల్, ఆ తర్వాత నుంచి అదృశ్యమయ్యాడు. బెంగాల్ సీఐడీ ప్రకారం, జిహాద్ హవ్లాదార్, సియామ్ హుస్సేన్ అనే ఇద్దరు బంగ్లాదేశీ పౌరులు ఎంపీని హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు ఎంపీ స్నేహితుడు రూ.5 కోట్ల సుపారీ ఇచ్చాడనే వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణా జిల్లాలోని కాలువలో మానవుడిదిగా భావిస్తున్న ఎముకనలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ 24 పరగణాస్ జిల్లాలో ఇటీవళ అరెస్టైన 33 ఏళ్ల నిందితుడు సియామ్ హుస్సేన్‌ని విచారించిన తర్వాత ఈ రికవరీ సాధ్యమైంది. ఈ కేసులో తొలుత జిహాద్ హవ్లాదార్ అనే బంగ్లాదేశ్‌కి చెందిన నిందితుడి అరెస్ట్ జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు రెండో వ్యక్తి హుస్సేన్‌ని అరెస్ట్ చేశారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
Read Also: Modi’s swearing-in: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు హాజరుకానున్నారు
బంగ్లాదేశ్ ఎంపీ శరీరభాగాలను పారేసిన ఖచ్చితమైన స్థలాన్ని సియామ్ హుస్సేన్ సీఐడీకి వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగా సీఐడీ దక్షిణ 24 పరగణాస్‌లోని భాంగర్ ప్రాంతంలోని ఉత్తర కాశీపూర్‌లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. మానవుడికి సంబంధించిన అనేక ఎములకును అధికారులు కనుగొన్నారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు.
కోల్‌కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలో ఫ్లాట్ బంగ్లా ఎంపీ చివరిసారిగా కనిపించారు. ఈ ఫ్లాట్‌లోనే అతడిని హత్య చేసి, చర్మ ఒలిచి, ఎముకలను శరీర భాగాలను వేరు చేసి వేరు వేరు చోట్ల పారేశారు. అన్వరుల్ అజీమ్ అనార్‌కు పరిచయస్తుడైన గోపాల్ బిశ్వాస్ మే 18న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఎంపీ మిస్సింగ్ గురించి తెలిపింది. మే 12న బిశ్వాస్ ఇంటికి వచ్చిన ఎంపీ, మే 13న మధ్యాహ్నం డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం వెళ్లి తిరిగి రాలేదు. హత్య చేసిన జిహాద్ హవ్లాదార్ కసాయి వృత్తిలో ఉన్నాడు. ఇతను బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడి ముంబైలో నివసిస్తున్నట్లు తేలింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!