Veg Biryani with Leftover Rice: పాత అన్నాన్ని పారేయొద్దు.. 10 నిమిషాల్లో సూపర్ బిర్యానీ రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veg Biryani with Leftover Rice: ఇంట్లో రాత్రి లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత అన్నం మిగిలిపోవడం సాధారణమే. చాలా మంది దానిని మళ్లీ తినడానికి ఇష్టపడక ఫ్రిజ్‌లో ఉంచేస్తారు లేదా చివరికి పారేస్తారు. అయితే మిగిలిపోయిన అన్నంతో ఎంతో రుచికరమైన, సువాసనభరితమైన వెజ్ బిర్యానీని సులభంగా తయారు చేసుకోవచ్చు. సరైన మసాలాలు, కూరగాయలు జత చేస్తే ఈ బిర్యానీని పాత అన్నంతో చేశారని ఎవరూ గుర్తించలేరు.
బిర్యానీ తయారీకి ఏం కావాలి..
* మిగిలిపోయిన చల్లటి అన్నం
* ఉల్లిపాయ
* టమాటా
* క్యారెట్
* బీన్స్
* బఠానీలు వంటి కూరగాయలు..
* పెరుగు
* అల్లం-వెల్లుల్లి పేస్ట్
* పచ్చిమిర్చి
* బిర్యానీ మసాలా
* ఇతర సుగంధ ద్రవ్యాలు అవసరం.
Also Read
- Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్‌లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Ragi Ganji: శరీరానికి చల్లదనం, ఎముకలకు బలం.. సాంప్రదాయ 'రాగి గంజి' తయారీ చేసుకోండి ఇలా.!
- Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
తయారు చేసే విధానం..
ముందుగా బాణలిలో నూనె లేదా నెయ్యి వేడి చేసి బే ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వంటి మసాలా దినుసులను వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అనంతరం టమాటా, కూరగాయలు, మసాలా పొడులు వేసి బాగా ఉడికించాలి. మంటను తగ్గించి పెరుగు కలిపి మసాలా బాగా సిద్ధమైన తర్వాత మిగిలిపోయిన అన్నాన్ని వేసి నెమ్మదిగా కలపాలి. పైగా కొత్తిమీర, పుదీనా ఆకులు చల్లి మూతపెట్టి తక్కువ మంటపై 5 నుంచి 7 నిమిషాలు ఉడికించాలి. అంతే.. వేడి వేడి, సువాసనతో నిండిన వెజ్ బిర్యానీ సిద్ధం.
దీనిని బూందీ రైతా లేదా ఉల్లిపాయ రింగులతో వడ్డిస్తే మరింత రుచిగా ఉంటుంది. ఇకపై మిగిలిపోయిన అన్నాన్ని పారేయకుండా ఇలా వెజ్ బిర్యానీగా మార్చి కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరచండి.
తాజావార్తలు
-
Veg Biryani with Leftover Rice: పాత అన్నాన్ని పారేయొద్దు.. 10 నిమిషాల్లో సూపర్ బిర్యానీ రెడీ
-
Trump: ఇరాన్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వం.. స్విట్జర్లాండ్ చర్చలు వాయిదాపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
-
PhonePe: ఫోన్‌పే వాడితే రూ.100 కట్.. ఎలాగో తెలుసా?
-
Team India: వాళ్లు ఫ్యామిలీలతో గడపొద్దా..? మాజీ కెప్టెన్ ఆగ్రహం..
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?