Trump: ఇరాన్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వం.. స్విట్జర్లాండ్ చర్చలు వాయిదాపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
- ఇరాన్‌పై విరుచుకుపడ్డ ట్రంప్
- ఇరాన్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వం
- స్విట్జర్లాండ్ చర్చలు వాయిదాపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగబోతున్నాయా? మళ్లీ బాంబు దాడులు జరగబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎవరూ కూడా తగ్గదేలే అన్నట్టుగా ఒకరిపై ఒకరు హెచ్చరికలు ఇచ్చుకుంటున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన అమెరికా-ఇరాన్ తాత్కాలిక శాంతి ఒప్పందం (MoU) సంతకాల కార్యక్రమం వాయిదా పడిన నేపథ్యంలో ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తమతో నిరాశతో కాదు.. అవసరంతోనే చర్చలకు వచ్చిందని పేర్కొంటూ.. “ఇరాన్ పూర్తిగా ముగిసిపోయింది. మేము 60 రోజుల ఒప్పంద కాలాన్ని గౌరవిస్తాం. కానీ వారికి ఒక్క పైసా కూడా ఇవ్వం.. పది సెంట్లు కూడా కాదు” అని వ్యాఖ్యానించారు. ఇరాన్ నాయకత్వంలోని మొజ్తబా చేసిన “అమెరికా నిరాశతో చర్చలకు వచ్చింది” అనే వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన ట్రంప్.. అమెరికా ఎప్పుడూ బలహీన స్థితిలో చర్చలు జరపదని స్పష్టం చేశారు. ఇరాన్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, ప్రస్తుతం ఆ దేశం సైనికంగా తీవ్రంగా బలహీనపడిందని అన్నారు.
ఇక అమెరికాలోని డెమోక్రాట్లపై కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు. “యుద్ధం ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పుడు వారికి వైమానిక దళం లేదు.. నౌకాదళం లేదు.. రాడార్ వ్యవస్థలు లేవు.. వైమానిక రక్షణ వ్యవస్థలు కూడా దాదాపు లేవు. అయినప్పటికీ నాలుగు నెలల క్రితం కంటే ఇప్పుడు ఇరాన్ బలంగా ఉందని డెమోక్రాట్లు చెబుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారో ఆశ్చర్యంగా ఉంది” అని అన్నారు.
Also Read
లెబనాన్ ఉద్రిక్తతలతో వాయిదా
ఇక అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన తదుపరి చర్చలు కూడా వాయిదా పడ్డాయి. లెబనాన్‌లో ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య మళ్లీ తీవ్ర ఘర్షణలు చెలరేగడంతో ఇరాన్ ప్రతినిధులు స్విట్జర్లాండ్‌కు వెళ్లేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇరాన్ అధికారులు లెబనాన్‌లో యుద్ధం ఆగిన తర్వాతే చర్చలు జరగాలని స్పష్టం చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా తన స్విట్జర్లాండ్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇక అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందంలో అత్యంత క్లిష్టమైన అంశంగా లెబనాన్ సంక్షోభం మారింది. ఇజ్రాయెల్-హిజ్బుల్లా ఈ ఒప్పందంలో భాగస్వాములు కాకపోయినా.. వారి మధ్య యుద్ధం ముగియడం ఒప్పంద విజయానికి కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ మద్దతుతో పనిచేసే హిజ్బుల్లా లెబనాన్‌లో కీలక శక్తిగా ఉండటంతో.. ఆ దేశ ప్రయోజనాల కోసం అవసరమైతే మళ్లీ ప్రాంతీయ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు కూడా ఇరాన్ సిద్ధంగా ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
- Tags
- Iran
- peace talks
- Switzerland
- trump
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!