Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cauliflower Quality Test: చలికాలం వచ్చిందంటే చాలు, మార్కెట్ నిండా తెల్లటి క్యాలీఫ్లవర్లు కళకళలాడుతుంటాయి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే, మార్కెట్లో గోభీ కొనేటప్పుడు అందరినీ వేధించే పెద్ద సమస్య ఏంటంటే, దానిలోపల దాక్కుని ఉండే పురుగులు. పైకి ఎంత చూడముచ్చటగా, తెల్లగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు క్యాలీఫ్లవర్లు లోపల చిన్న పురుగులు ఉంటాయి. దీనివల్ల మన డబ్బు వృథా కావడమే కాకుండా ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. మార్కెట్లో మోసపోకుండా నాణ్యమైన, పురుగులు లేని క్యాలీఫ్లవర్‌ను దాన్ని కట్ చేయకుండానే ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మనం కొనే క్యాలీఫ్లవర్లు తాజాగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి దాని పువ్వుల గట్టితనాన్ని గమనించాలి. పువ్వులు ఒకదానితో ఒకటి గట్టిగా అతుక్కుని ఉండాలి. ఒకవేళ పువ్వుల మధ్యలో ఖాళీలు ఎక్కువగా ఉండి విడిపోయినట్లు కనిపిస్తే అలాంటి వాటిని అసలు కొనకండి. ఎందుకంటే ఇలాంటి వదులుగా ఉండే గోభీ లోపలే పురుగులు, మురికి సులభంగా దాక్కుంటాయి. అలాగే, గోభీ కింద ఉండే ఆకులు దాని ఫ్రెష్ నెస్ ని బయటపెడతాయి. ఆకులు పచ్చగా, గట్టిగా, తాజాగా ఉంటే ఆ గోభీ ఫ్రెష్ గా ఉన్నట్లే. ఒకవేళ ఆకులు ఎండిపోయినా, పసుపు రంగులోకి మారినా, వాడిపోయినా అవి పాత గోభీ అని అర్థం చేసుకోవాలి. అలాంటి వాటిలో పురుగులు ఉండే అవకాశం చాలా ఎక్కువ.
Also Read
- World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
- Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
- Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
- How to Make Besan at Home: ఇక మార్కెట్లో కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోనే స్వచ్ఛమైన శనగపిండి తయారు చేసుకోండిలా..
గోభీ రంగును కూడా పరిశీలించాలి. మంచి క్యాలీఫ్లవర్ లేత క్రీమ్ రంగులో లేదా పూర్తిగా తెలుపు రంగులో ఉండాలి. ఒకవేళ గోభీ మీద నల్లటి, గోధుమ రంగు లేదా పసుపు రంగు మచ్చలు కనిపిస్తే అస్సలు కొనకండి. ఇది గోభీకి ఫంగస్ పట్టిందని లేదా పురుగులు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం. అలాగే, గోభీ పువ్వులను నిశితంగా పరిశీలించాలి. దాని పైభాగంలో లేదా కాడపై చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయా లేదా అని చూడండి. ఒకవేళ గోధుమ రంగులో ఉండే చిన్న పొడి లాంటి పదార్థం (పురుగుల వ్యర్థాలు) కనిపిస్తే, దాని లోపల పురుగులు ఉన్నాయని ఇట్టే పసిగట్టవచ్చు. అదేవిధంగా, క్యాలీఫ్లవర్లు బరువును బట్టి కూడా దాని నాణ్యతను అంచనా వేయవచ్చు. సైజులో పెద్దగా ఉండి, చేతికి వెయిట్ లేకుండా తేలికగా ఉంటే ఆ గోభీ లోపల ఖాళీగా ఉండడమో లేదా పురుగులు తినేయడమో జరిగిందని అర్థం. కాబట్టి దాని పరిమాణానికి తగినట్లుగా బరువున్న గోభీని ఎంచుకోవాలి. ముఖ్యంగా గోభీ కింది కాడ గట్టిగా, ఎలాంటి పగుళ్లు లేకుండా ఉండాలి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు, ఇకపై మార్కెట్లో ఎప్పుడూ మోసపోకుండా చక్కటి, పురుగులు లేని మంచి క్యాలీఫ్లవర్ ను సులభంగా ఇంటికి తెచ్చుకోవచ్చు.
తాజావార్తలు
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
-
Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
-
Bangladesh: ‘‘ఢిల్లీనా.. ఢాకానా?’’ బంగ్లాదేశ్‌లో మళ్లీ భారత్ వ్యతిరేక నినాదాలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!