NTV Telugu Site icon

Nitish Kumar: పువ్వు పార్టీతో నితీశ్‌కు కలిసొచ్చేదేంటి?

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. తాజాగా మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ముచ్చటగా తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇంతవరకు ఆయన ప్రస్థానం బాగానే ఉంది. కానీ ఆయన మనసులో ఉన్న కోరిక మాత్రం తీరకుండానే పోతుంది. ఇన్నిసార్లు సీఎం సీట్లో కూర్చున్నా.. రాష్ట్ర పరిథి దాటలేకపోయారు. అందుకోసమే ఈసారైనా హస్తినకు పోవాలని స్కెచ్ వేశారు. కానీ ఆయన మాస్టర్ ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఇంత సడన్‌గా తన ప్రణాళికను ఎందుకు మార్చుకున్నారు. మళ్లీ కమలంతో ఎందుకు జోడీ కట్టాల్సి వచ్చింది. నితీష్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

Read Also: Rohini Acharya : చెత్త తిరిగి డంపులో పడింది.. నితీష్‌ కుమార్‌ పై లాలూ యాదవ్‌ కుమార్తె ట్వీట్

గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ బలమైన శక్తిగా రాజ్యమేలుతోంది. దశాబ్ద కాలంగా మోడీ ప్రధానిగా కొనసాగుతున్నారు. మరోసారి అధికారం కోసం బీజేపీ సన్నద్ధమవుతోంది. ఇలాంటి తరుణంలో మళ్లీ బీజేపీకి అవకాశం ఇవ్వకూడదని.. ఢిల్లీ పీఠంపై కూర్చోవాలన్న కోరికతో నితీష్‌కుమార్ ఇండియా కూటమి ఏర్పాటుకు పావులు కదిపారు. అనుకున్నట్టుగానే కూటమి ఏర్పడింది. కానీ ఆదిలోనే ఆయన ఆశలు గల్లంతయ్యాయి. ఇండియా అధ్యక్షుడిగా తనకు కాకుండా ఖర్గేకు ఇవ్వడం ఆయనకు నచ్చలేదు. దీంతో ఆయన బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇప్పుడు తాజాగా మరోసారి బీజేపీతో నితీష్ జత కట్టారు. కేంద్రంలో అయితే పువ్వు పార్టీ పూర్తి మెజార్టీతో ఉంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల మద్దతు లేకుండానే కాషాయ పార్టీకి సంపూర్ణ మద్దతు ఉంది. ముచ్చటగా మూడోసారి కూడా అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నామని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎన్డీఏలో జేడీయూ చేరడం వల్ల నితీష్‌కు కలిసొచ్చేదేంటి? నితీష్‌కు ఏమైనా అవకాశం ఉంటుందా? అంటే ఏ మాత్రం ఉండదు. తిరిగి మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే మళ్లీ మోడీనే ప్రధాని పీఠంపై కూర్చుంటారు. లేదంటే ఆ పార్టీలోని ముఖ్యనేత ఎవరైనా ఈ సీట్లు కూర్చుంటారే తప్ప మరొకరికి ఛాన్సుండదు. మరీ ఢిల్లీ పీఠంపై కూర్చోవాలనుకున్న నితీష్ కల నెరవేరకుండానే పోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి నితీష్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిం