ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ స్కంద. మాస్ డైరెక్టర్ బోయపాటి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో డాన్సింగ్ బ్యూటీ శ్రీలీల, మేజర్ మూవీ బ్యూటి సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు.బోయపాటి ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్స్ తో సుమారు 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమాకు శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.సెప్టెంబర్ 28 న ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది.స్కంద సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు కూడా కలెక్షన్స్ పర్వాలేదనిపించాయి. ఏరియాల వారీగా చూస్తే..
నైజాంలో రూ. 1.57 కోట్లు, సీడెడ్‌లో రూ. 48 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 37 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, గుంటూరులో రూ. 23 లక్షలు, కృష్ణాలో రూ. 14 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలు వసూళ్లు వచ్చాయి. దీంతో స్కందకు రూ. 3.27 కోట్ల షేర్, రూ. 5.55 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే వీకెండ్ అయినప్పటికీ ఫస్ట్ రెండు రోజులతో పోలిస్తే మూడో రోజు కలెక్షన్స్ కాస్త తగ్గాయి.స్కంద మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులకు కలిపి నైజాంలో రూ. 6.32 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.97 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.09 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 73 లక్షలు, గుంటూరులో రూ. 1.56 కోట్లు, కృష్ణాలో రూ. 75 లక్షలు, నెల్లూరులో రూ. 72 లక్షల వసూళ్లు నమోదు అయ్యాయి. దీంతో మొత్తంగా స్కంద చిత్రం రూ. 15.39 కోట్ల షేర్, రూ. 24.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది.ఇలా స్కంద సినిమాకు 3 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 18.38 కోట్ల షేర్, రూ. 31.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసేందుకు స్కందకు ఇంకా రూ. 28.62 కోట్ల షేర్ అయితే రావాల్సి వుంది.