వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ ఇండియా పర్యటనకు వచ్చారు. ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు.. చిన్హే భారత పర్యటనలో ఉంటారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. ఈ పర్యటనలో ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక చర్చలపై చర్చించనున్నారు.
రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్‌ను ఢిల్లీ కోర్టు మంగళవారం 3 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. మే 13న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మాలివాల్‌పై బిభవ్ భౌతికదాడికి తెగబడ్డారు.
ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు. 16 మంది ప్రాణాలను బలిగొన్న ఆ హోర్డింగ్ పెట్టింది ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని భవేశ్ భిండే 3 రోజులు మూడు రాష్ట్రాలు తిరిగాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ముప్పుతిప్పలు పడ్డాడు.
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ స్కంద. మాస్ డైరెక్టర్ బోయపాటి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో డాన్సింగ్ బ్యూటీ శ్రీలీల, మేజర్ మూవీ బ్యూటి సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు.బోయపాటి ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్స్ తో సుమారు 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమాకు శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.సెప్టెంబర్ 28 న ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన…
తెలంగాణకు మరో 3 రోజులపాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి దిశ నుండి గాలులు లోయర్ ట్రోపోస్పీయర్ వరకు బలంగా వ్యాపించి, దక్షిణ బంగళాఖాతంలో కొంత భాగం, నికోబార్ ద్వీపం, దక్షిణ అండమాన్ సముద్రము మొత్తం, ఉత్తర అండమాన్ సముద్రంలో కొంత భాగాములోకి నైరుతి రుతపవనాలు ఈరోజు ప్రవేశించాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానిని అనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో సుమారుగా 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.…