Flavio Bolsonaro: అమెరికాకు పారిపోయిన బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి.. లూలా గెలుపు తర్వాత కీలక పరిణామం!
- బ్రెజిల్ ఎన్నికల అధ్యక్ష అభ్యర్థి ఫ్లావియో బొల్సోనారో అమెరికాకు పరారీ..
- అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి, లూలా గెలుపు తర్వాత కీలక రాజకీయ పరిణామం..
- తాము అనుమతి ఇచ్చామన్ని ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flavio Bolsonaro: బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో కుమారుడు, అధ్యక్ష అభ్యర్థి ఫ్లావియో బొల్సోనారో తన కుటుంబంతో కలిసి అమెరికా చేరినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. పాస్‌పోర్టులు అప్పగించాలని బ్రెజిల్ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన దేశం విడిచిపెట్టడం సంచలనంగా మారింది. అయితే, ఆయన దేశం విడిచిపెట్టినట్లు అధికారిక సమాచారం లేదని బ్రెజిల్ పోలీసులు చెబుతున్నారు.
లూలా గెలుపు తర్వాత కీలక పరిణామం..
ఇటీవల బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా విజయం సాధించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు బొల్సోనారా అమెరికా చెక్కేశారు. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం ప్రజలకు కనిపించకుండా ఉన్న ఫ్లావియో బొల్సోనారో, ఆయన కుటుంబం అమెరికాలోని మియామీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. అక్కడికి చేరిన తర్వాత బ్రెజిల్‌కు తానే సరైన నాయకుడిగా అభివర్ణించుకున్నారు. ఆదివారం తన కళ్ల ముందే ఎన్నికల మోసం జరిగిందని ఆరోపించారు. లూలాకు న్యాయవాదిగా పనిచేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి క్రిస్టియానో జానిన్పై కూడా ఆరోపణలు చేశారు.
Also Read
- Bangladesh: షేక్ హసీనా వీడియో వివాదం.. బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మృతి..
- US Fed Interest Rate Decision: అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం
- Spain Train Crash: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ, 46 మంది మృతి
- Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
అర్జెంటీనా, ఈక్వెడార్ మీదుగా..
ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫ్లావియో దేశం విడిచే వెళ్లే అవకాశం ఉందన్న అనుమానంతో ఆయన పాస్‌పోర్టు అప్పగించాలని బ్రెజిల్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సోనారోపై పలు అవినీతి కేసులుపై దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలో పాస్ పోర్టు అప్పగించకుండా అర్జెంటీనా, ఈక్వెడార్ మీదుగా ఆయన అమెరికా చేరినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
ఫ్లావియో వద్ద బ్రెజిలియన్, దౌత్య పాస్‌పోర్టులు రద్దయినప్పటికీ, ఇటలీ పాస్‌పోర్టు కూడా ఉన్నట్లు కథనం తెలిపింది. బ్రసీలియా నుంచి 1,500 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న అర్జెంటీనాకు ఆయన ఎలా చేరుకున్నారన్నది మాత్రం స్పష్టంగా తెలియలేదు. ప్రైవేట్ జెట్‌లో ఫ్లావియో బొల్సోనారో ఈక్వెడార్ లోని గ్వాయాకిల్ నగరానికి అర్జెంటీనా ననుంచి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే ఇంధనం నింపుకుని మియామీకి వెళ్లినట్లు తెలుస్తోంది.
అంతకుముందు ఆదివారం ఓటమి తర్వాత ఎన్నిలక ఫలితాలను తాను అంగీకరించడం లేదని అన్నారు. సోమవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా.. దేశం విడిచి వెళ్లకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించిందని, అది తనను భయపెట్టే ప్రయత్నమని ఒక వీడియో విడుదల చేశారు. దేశం విడిచి వెళ్లాలనే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు. మంగళవారం ఫ్లావియో బొల్సోనారో బ్రెజిల్ ఈశాన్య ప్రాంతంలోని ఫ్యూర్టో ఇగువాజు నగరం నుంచి విమానంలో ప్రయాణించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. దీనికి ముందు ఆయన అధికారిక కాన్వాయ్ బ్రసీలియాలోని నివాసం నుంచి బయలుదేరినట్లు కనిపించింది.
ధ్రువీకరించిన ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బొల్సోనారో కుటుంబానికి చాలా కాలంగా మద్దతుదారుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనే గెలవాలని ట్రంప్ కోరుకున్నారు. అయితే, బొల్సోనారో అమెరికాకు రావడంపై ట్రంప్ మాట్లాడుతూ.. “దీనిపై నేను వ్యాఖ్యానించదలచుకోలేదు. అయితే, ఆయన దేశంలోకి రావడానికి మేము అనుమతి ఇచ్చామని నాకు తెలుసు. ఇకపై ఏమవుతుందో చూద్దాం” అని అన్నారు. అమెరికాలో ప్రవాసంలోనే ఉంటూ రాజకీయాలు చేయాలని బొల్సోనారో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
KTR : రాష్ట్రంలో కరువు.. రేవంత్‌కు మూసీ పిచ్చి
-
Honey Trap పోలీసు అధికారులే టార్గెట్‌గా రూ.లక్షల్లో వసూళ్లు!
-
IMD Alert: కోనసీమకు మరో ముప్పు.. అర్నబ్ వెనుకే మరో వాయుగుండం..
-
Flavio Bolsonaro: అమెరికాకు పారిపోయిన బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి.. లూలా గెలుపు తర్వాత కీలక పరిణామం!
-
ESI Scam : ESIలో ఇదేం దందా.? క్లీనింగ్ కాంట్రాక్ట్‌లో కోట్ల కుంభకోణం..
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..