NTV Telugu Site icon

Supreme Court: మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరం ఎలా అవుతుంది? సుప్రీం ప్రశ్న

Supreme Court

Supreme Court

కర్ణాటకలోని ఓ మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరమా అని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. దీంతో పాటు మసీదులో నినాదాలు చేసిన నిందితులను ఎలా గుర్తించారని కోర్టు ప్రశ్నించింది. జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ సందీప్ మెహతా డివిజన్ బెంచ్ నిందితుల గుర్తింపును నిర్ధారించే ముందు సీసీటీవీ ఫుటేజీ లేదా మరేదైనా సాక్ష్యాలను పరిశీలించారా? అని కూడా ప్రశ్నించింది.

READ MORE: Group-2 Exam: పురుటి నొప్పులతోనే గ్రూప్‌-2 పరీక్ష రాసిన అభ్యర్థి

మసీదు లోపల జై శ్రీరామ్ నినాదాలు చేయడం మతపరమైన మనోభావాలను దెబ్బతీసిన నేరం కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ ప్రశ్నలను అప్పీలుదారు తరఫు న్యాయవాదిని అడిగిన సుప్రీంకోర్టు ఫిర్యాదు కాపీని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అప్పీలు దాఖలు చేయలేదు.

READ MORE:IND vs AUS: బ్యాటింగ్‌లో కోహ్లీ విఫలం.. రిటైర్ అయి లండన్‌లో నివసించు అంటూ ట్రోల్స్

వాస్తవానికి.. దక్షిణ కన్నడ జిల్లా పోలీసులు గత ఏడాది మసీదులో జైశ్రీరామ్ నినాదాలు చేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ మసీదులోకి ప్రవేశించి జై శ్రీరామ్ నినాదాలు చేశారని, అక్కడున్న వారిని బెదిరించారని ఆరోపించారు. నిందితులిద్దరూ ముస్లింలను శాంతియుతంగా బతకనివ్వమని బెదిరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఇరువురిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 295A (మతపరమైన భావాలను దౌర్జన్యం చేసే ఉద్దేశ్యంతో చేసిన చర్యలు), 447 (అతిక్రమం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు.

READ MORE:Farmer Won The Lottery: రైతుకు రూ.287 కోట్ల లాటరీ.. అంతలోపే ఊహించని ప్రమాదం..

కాగా.. ఇద్దరు యువకులు తమపై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది సెప్టెంబరు 13న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం నాగప్రసన్న ధర్మాసనం ఈ కేసును కొట్టివేసింది. నిందితులిద్దరికీ రిలీఫ్ ఇస్తూ..ఈ నినాదాలు చేయడం ద్వారా ప్రజా జీవితంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపవని హైకోర్టు పేర్కొంది. దీంతో ఫిర్యాదుదారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Show comments