చిన్నచిన్న కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు యువతీ, యువకులు, వివాహిత మహిళలు. పండుగ పూట వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడకు చెందిన రమ వెంకట లక్ష్మీపతి స్వాతికి 2011 డిసెంబర్ నెలలో సామర్లకోటలో నివసించే శ్రీధర్ తో వివాహం జరిగింది. కేపీహెచ్బీ కాలనీ మంజీరా మెజిస్టిక్ హోమ్స్, 9వ అంతస్తులో 910 ప్లాట్ లో నివాసం ఉంటున్నారు.
Read Also: McDonald’s Business Strategy: పోటీ సంస్థలకు భిన్నంగా మెక్ డొనాల్డ్స్ వ్యాపార వ్యూహం
వీరికి 2016లో ఓ బాబు జన్మించాడు. ఆ బాబు మానసిక అంగవైకల్యంతో పుట్టాడు. దీంతో శ్రీధర్ కుటుంబ సభ్యులు స్వాతిని మానసికంగా వేధించటం ప్రారంభించారు. ఆ పిల్లాడిని చంపేసి మరో గర్భం దాల్చాలని ఒత్తిడి తెస్తూ గొడవపడుతూ ఉండేవారు. పిల్లాడు పుట్టి ఏడేళ్ళయినా వేధింపులు కొనసాగుతున్నాయి. దీంతో ఈ వేధింపులు తాళలేని స్వాతి ఆదివారం రాత్రి అంతస్తు పైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శ్రీధర్ అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మరణంతో పిల్లాడు తల్లికోసం ఆరాటపడుతున్నాడు. అల్లుడు, అతని కుటుంబసభ్యులకు కఠిన శిక్ష పడేలా చూడాలని స్వాతి తల్లిదండ్రులు కోరుతున్నారు.
Read Also: McDonald’s Business Strategy: పోటీ సంస్థలకు భిన్నంగా మెక్ డొనాల్డ్స్ వ్యాపార వ్యూహం