Milk : పాలను సంపూర్ణ పోషకాహారం అని పిలుస్తారు. పాలలోశరీరానికి మేలు చేసే అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టే ప్రతిరోజూ ఒకటి నుండి రెండు గ్లాసుల పాలు తాగాలని నిపుణులు సూచిస్తుంటారు. పాల ద్వారా మన శరీరానికి కాల్షియం, ప్రొటీన్, సహజ కొవ్వు, కేలరీలు, విటమిన్ డి, విటమిన్ బి-2, పొటాషియం అనేక సూక్ష్మ పోషకాలు అందుతాయి. కానీ ప్రఖ్యాత పోషకాహార నిపుణుల సలహా ఏంటంటే పాలను చల్లగా కాకుండా మరిగిస్తే దాని పోషక విలువలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు.
మరిగించిన పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
పాలను వేడి చేయడం వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే, పాలలోని హానికరమైన క్రిములను నాశనం అవుతాయి. ఈ ప్రక్రియను పాశ్చరైజేషన్ అంటారు. అంతే కాకుండా వేడి పాలు తాగడం వల్ల శరీరానికి మరింత శక్తి వస్తుంది.
Read Also: America: అమెరికాలో బీభత్సం సృష్టించిన టోర్నడో.. 21మంది మృతి
బరువు తగ్గుదల
ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల మీ కడుపు నిండిన అనుభూతిని కలుగుతుంది. ఇది మీకు తక్కువ ఆకలిని కలిగిస్తుంది. తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా క్రమంగా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. ప్రతి వ్యక్తి రాత్రిపూట ఒక గ్లాసు గోరువెచ్చని పాలు త్రాగాలి. అది శరీరానికి, మనస్సుకు అపారమైన ఉపశమనాన్ని ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మరుసటి రోజు అలసటగా అనిపించకుండా నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
ఎముకలు బలపడుతాయి
పాలలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. గోరువెచ్చని పాలు తాగడం వల్ల మీ శరీరం మునుపటి కంటే బలంగా తయారవుతుంది.
Read Also: Aha: తెలుగు ఇండియన్ ఐడల్ నుండి మానస అవుట్!
అదుపులో మధుమేహం
రోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కాబట్టి ఇలా చేయడం వల్ల డయాబెటిక్ పేషెంట్లకు సహాయపడుతుంది.. వారు ఆరోగ్యంగా ఉంటారు