Honor X9b 5g Smartphone Launched in India: చైనా ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ‘హానర్’ భారత మార్కెట్లోకి వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. ఇటీవల హానర్ 90 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చిన హానర్ కంపెనీ.. తాజాగా మరో ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎక్స్ సిరీస్‌లో హానర్ ఎక్స్9బిని గురువారం రిలీజ్ చేసింది. 108 ఎంపీ కెమెరా, 5800 ఎంఏహెచ్ బ్యాటరీ, యాంటీడ్రాప్ టెక్నాలజీతో ఈ ఫోన్ వస్తోంది. హానర్ ఎక్స్9బిని 5జీ ఫోన్ ధర, ఫీచర్స్ వివరాలు ఓసారి చూద్దాం.
Honor X9b 5g Price:
హానర్ ఎక్స్9బి స్మార్ట్‌ఫోన్ సింగిల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.25,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ రెండు రంగుల్లో (మిడ్‌నైట్ బ్లాక్, సన్‌రైజ్ ఆరెంజ్) లభిస్తుంది. ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, దేశవ్యాప్తంగా 1800 రిటైల్ స్టోర్లలో అమ్మకాలు మొదలవుతాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొనుగోళ్లపై రూ.3 వేలు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Honor X9b 5g Specs:
హానర్ ఎక్స్9బి స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13తో వస్తోంది. మ్యాజిక్ ఓఎస్ 7.2తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.5కె రిజల్యూషన్ కలిగిన కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేటు ఉంది. అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ డిస్‌ప్లే టెక్నాలజీని అందిస్తున్నారు. దాంతో ఫోన్ కిందపడినా డిస్‌ప్లేకు ఎలాంటి డామేజ్ జరగదు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
Also Read: Sarfaraz Khan: జడేజా సమన్వయ లోపం.. రనౌట్‌పై స్పందించిన సర్ఫరాజ్
Honor X9b 5g Camera and Battery:
హానర్ ఎక్స్9బి స్మార్ట్‌ఫోన్ వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 108 ఎంపీ ప్రధాన కెమెరా, 5 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఇందులో 5800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 35W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఎన్‌ఎఫ్‌సీ, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.