హనీ రోజ్ పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ పేరు వినిపిస్తుంది.. ఒక్క సినిమాతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగింది. అంతేకాదు ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి లో బాలయ్య సరసన నటించింది ఈ భామ.. ఆ సినిమా అమ్మడు కేరీర్ లో అతి పెద్ద హిట్ సినిమా.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో డిమాండ్ పెరిగింది.. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే..
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హనీ రోజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో ఈ అమ్మడు తన అందంతో కట్టిపడేసింది. మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా రాణించిన హనీ రోజ్ అక్కడ మంచి క్రేజ్ ను ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులు కూడా ఆమె అందానికి ఫిదా అయ్యారు..
ఈ సినిమా తర్వాత సినిమాల్లో అయితే కనిపించలేదు కానీ షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ లతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంది. ఎప్పుడూ ఎదో ఒక షాపింగ్ మాల్ ను ఓపెన్ చేస్తూ.. అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఈ అమ్మడు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కు ఎంత రెమ్యునరేషన్ అందుకుంటుందో తెలుసా.. అమ్మడి డిమాండ్ చూస్తే మతిపోవాల్సిందే.. ఒక్క షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు 60 లక్షల నుంచి 70 లక్షల వరకు వసూల్ చేస్తుందని తెలుస్తోంది. హనీ రోజ్ క్రేజ్ దృష్టిలో ఉంచుకొని అంత మొత్తంలో ఇవ్వడానికి షాపింగ్ మాల్స్ యాజమాన్యం కూడా ఆసక్తి చూపించడం విశేషం.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఓ సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.