Vangalapudi Anitha: చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చారు.. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత..
- సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చారు..
- రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది..
- పెంచిన పెన్షన్ రూ.4000తో పాటు.. మూడు నెలలకు 3000 కలిపి మొత్తం రూ.7000 పెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్‌లో పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.. మంగళగిరి నియోజకవర్గంలో.. ఉదయమే స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.. ఇక, ఎక్కడికక్కడ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు హోంమంత్రి వంగలపూడి అనిత.. విజయవాడ నుంచి రోడ్డు మార్గన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆమె.. మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చారు.. రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందని కొనియాడారు.. పెంచిన పెన్షన్ 4000 రూపాయలతో పాటు, ఎన్నికల సమయంలో మూడు నెలలు 3000 కలిపి మొత్తం 7000 రూపాయలు పెన్షన్లు లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిపాలన కొనసాగిస్తాం అన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత.. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరి వెళ్లారామె.
Read Also: Kashmir : పీఓకే జైలు నుంచి 20 మంది ఖైదీలు పరార్.. పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి
Also Read
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
కాగా, ఉదయం 6 గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైన విషయం విదితమే.. గత ప్రభుత్వంలో రూ.3 వేలుగా ఉన్న పెన్షన్.. ఇప్పుడు రూ.4 వేలకు చేరింది.. పెంచిన పెన్షన్ గత మూడు నెలలది కూడా కలపడంతో ఈ నెలలో ఒకేసారి లబ్ధిదారులకు రూ.7 వేలు అందజేస్తున్నారు గ్రామపంచాయతీ సిబ్బంది. ఒకేసారి తమ చేతిలో రూ.7వేల పెన్షన్ చూసుకుని వృద్ధులు మురిసిపోతున్నారు.
తాజావార్తలు
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!