Home Minister Anitha: పవన్ కల్యాణ్ కామెంట్లపై స్పందించిన హోం మంత్రి అనిత.. ఆసక్తికర వ్యాఖ్యలు..
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై స్పందించిన హోం మంత్రి అనిత..
- హోంమంత్రిగా తాను ఫెయిలైనట్లు పవన్ ఎక్కడా అనలేదు..
- పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పాజిటివ్‌గా తీసుకుంటాను..
- సోషల్ మీడియాలో భయంకరమైన పోస్టులు పెడుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Anitha: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఓ రకంగా పొలిటికల్ హీట్ పెంచాయి.. ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాను హోంమంత్రిని అయితే… పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారు.. అంతేకాదు.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి భావప్రకటనా స్వేచ్ఛ అంటున్నారని… అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే, ఎన్డీఏ ఎమ్మెల్యేల పనితీరుపై కూడా పవన్ కల్యాణ్ ఘాటు విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఆసక్తికర కామెంట్లు చేశారు.
Read Also: Deputy CM Pawan Kalyan: నేడు పల్నాడు జిల్లాకు డిప్యూటీ సీఎం.. సరస్వతి పవర్ భూములపై ఫోకస్..
Also Read
తాను హోంమంత్రిగా ఫెయిలయ్యానని పవన్ కల్యాణ్ అనలేదన్నారు హోం మంత్రి అనిత. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పాజిటివ్‌గా తీసుకుంటున్నామన్నారు. పవన్ వ్యాఖ్యలను కట్ చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో భయంకరమైన పోస్టులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు అనిత. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అసభ్య మెసేజ్‌లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ కూతుళ్లు, నారా బ్రాహ్మణి, భువనేశ్వరిపై అనుచిత పోస్టింగ్స్ పెడుతున్నారన్నారు హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, ఈ నేపథ్యంలోనే ఆవేదనతోనే పవన్ కల్యాణ్ అలా మాట్లాడారు అని తెలిపారు.. నేటికీ నేను సోషల్ మీడియా బాధితురాలినేన్న ఆమె.. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై జిల్లాల వారీగా సమీక్ష చేస్తున్నాం అన్నారు.. పోలీసు శాఖ నిర్లిప్తత నుంచి బయటకు రావాలి అని హితవు చెప్పారు.. గంజాయి మత్తులో ఉన్న వారు పోలీసులపై ఛాలెంజ్ చేసి వెళ్తున్నారు అంటూ విపక్షంపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత..
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!