Kerala: ఎయిర్ అరేబియా విమానానికి బాంబు బెదిరింపు.. బాంబ్ స్వ్కాడ్స్ తనిఖీలు
- కాలికట్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు
- ఎయిర్ అరేబియా విమానంలో నోట్ గుర్తింపు
- తనిఖీల తర్వాత బూటకపు బెదిరింపుగా వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని కాలికట్ విమానాశ్రయంలో ఎయిర్ అరేబియా విమానానికి బూటకపు బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. జూన్ 22, శనివారం ఉదయం కాలికట్ విమానాశ్రయం నుంచి షార్జాకు బయలుదేరిన ఎయిర్ అరేబియా విమానానికి బాంబు బెదిరింపుతో బాంబు డిటెక్షన్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. విమానం టేకాప్ కాకుండా ఎయిర్‌పోర్టులో నిలిపివేశారు. షార్జా నుంచి కాలికట్‌కి విమానంలో వచ్చిన ప్రయాణీకుల్లో ఒకరు.. సీట్లలో ఒక దానిపై బాంబు అని నోట్ ఉంచారు. దీన్ని గమనించిన స్టాప్.. భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో తనిఖీలు చేపట్టగా.. నకిలీదిగా తేల్చారు. బాంబు డిటెక్షన్ స్క్వాడ్ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిందని అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసులో సూత్రధారి అరెస్ట్.. ఎవరు ఈ “రవి అత్రి”..
Also Read
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
శనివారం ఉదయం కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షార్జాకు బయలుదేరాల్సిన ఎయిర్ అరేబియా విమానానికి సంబంధించి బూటకపు బాంబు బెదిరింపు వచ్చిందని.. దీంతో బాంబు డిటెక్షన్ స్క్వాడ్, పోలీసుల తనిఖీలు నిర్వహించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. తనిఖీలు పూర్తయ్యాయని.. ఫ్లైట్ టేకాఫ్ కోసం క్లియర్ కావడానికి.. బాంబు డిటెక్షన్ స్క్వాడ్ నుంచి నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారి ఉదయం 11 గంటలకు చెప్పారు. ఉదయం 8.30 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుందని ఆయన చెప్పారు. అలాగే ప్రయాణికులకు విమానాశ్రయంలో వసతి కల్పించామని.. ఆహారం, నీరు అందించినట్లు వెల్లడించారు. కాగా విమానంలో నోట్‌ను పెట్టిన ప్రయాణికుడిని ఇంకా గుర్తించలేదని, బూటకపు బెదిరింపు వెనుక ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కరిపూర్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.
ఇది కూడా చదవండి: Citroen C3 Aircross Plus: ఈ కారుపై భారీ తగ్గింపు.. త్వర పడండి
- Tags
తాజావార్తలు
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
-
Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Telangana Rains : తెలంగాణలో కుండపోత.. మహబూబాబాద్‌లో 19.1 సెం.మీ వర్షం
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!