HMPV News : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బలరాంపూర్ ఆసుపత్రిలో ఒక మహిళ hmpv వైరస్ కారణంగా మరణించిందని వార్తలు వైరల్ అయ్యయి. ఇప్పుడు ఆసుపత్రి దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. రాజేంద్ర నగర్ నివాసి రామ్ అధర్ భార్య 60 ఏళ్ల మహిళ ఉషా శర్మ మరణించింది HMPV బారిన పడి కాదని.. వేరే ఆరోగ్య సమస్యలతో తను మరణించినట్లు బలరాంపూర్ ఆసుపత్రి తెలిపింది. లక్నోలో బలరాంపూర్ ఆసుపత్రిలో చేరిన ఆమె 05.01.2025తను దగ్గు, తేలికపాటి జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఆమెను అపోలో ఆసుపత్రిలో చేరారు.
Read Also:Manchu Manoj: పీఎస్‌లో ఫిర్యాదు.. మంచు మనోజ్‌కు అస్వస్థత..!
చికిత్స సమయంలో తనకు hmpv పాజిటివ్ అని చెప్పారు. రోగి 07.05.2025న అపోలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆమెను 07.01.2025న చరక్ ఆసుపత్రిలో చేర్చారు. రోగి ఉషా శర్మను 08.01.2025న చరక్ ఆసుపత్రి KGMUకి రిఫర్ చేసింది. తరువాత KGMU నుండి ఆమెను బలరాంపూర్ ఆసుపత్రికి రిఫర్ చేసింది. 08.01.2025న ఉషా శర్మ శ్వాసకోశ సమస్యలు, బలహీనత, వైరల్ న్యుమోనైటిస్/AKI/ టైప్ 2 DM/HTN/హైపోథైరాయిడిజం పాత టీబీ హిస్టరీతో రాత్రి 9.40 గంటలకు ఆసుపత్రిలో చేరారు. రోగి నమూనాలను KGMU మైకోబయాలజీ ల్యాబ్‌కు పంపగా, నివేదికలో నెగిటివ్ గా తేలింది.
Read Also:CM Revanth Reddy: కాంగ్రెస్‌ను గెలిపించండి.. మరో రెండు గ్యారెంటీలు విడుదల చేసిన సీఎం
12.01.2025న మధ్యాహ్నం 1:45 గంటలకు రోగికి మూర్ఛలు వచ్చాయని, వాంతులు అయ్యాయని, అపస్మారక స్థితిలోకి వెళ్లారని ఆసుపత్రి తెలిపింది. రోగిని వెంటనే ఐసియుకి తరలించారు. అక్కడ తనకు సరైన చికిత్స అందించారు. కానీ రోగి 13.01.2025న మధ్యాహ్నం 12:05 గంటలకు మరణించారు. పైన పేర్కొన్న వ్యాధులతో పాటు, రోగి మూర్ఛ ఎపిసోడ్, ఆస్పిరేషన్ న్యుమోనియా, హైపోకలేమియా, గుండె ఆగిపోవడం వల్ల మరణించినట్లు ఆసుపత్రి తెలిపింది.